Mad Trailer: ఎన్టీఆర్ చేతుల మీదుగా `మ్యాడ్` ట్రైలర్.. ఎలా ఉందంటే?
Mad Movie: నార్నేనితిన్, సంగీత్‌శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ `మ్యాడ్`. తాజాగా ఈ మూవీ ట్రైలర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంచ్ చేశారు.
Mad Trailer Released: ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా 'మ్యాడ్' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr. Ntr ) రిలీజ్ చేశాడు. ట్రైలర్ చూస్తే.. యూత్‌ను టార్గెట్‌గా పెట్టుకుని తీసిన సినిమాగా తెలుస్తోంది. అల్లరి తప్ప చదువు మీద ధ్యాసలేని ముగ్గురు ఇంజనీరింగ్ కుర్రాళ్లు చుట్టూ తిరిగే కథగా ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ ట్రైలర్ ఫన్ అండ్ పంచ్ డైలాగ్స్‌తో ఆద్యంతం అలరించేలా ఉంది.
ట్రైలర్ ఓపెన్ చేస్తే.. '' ఏసీ పనిచేస్తలేదు మావ అని ఓ యువకుడు చెప్పగానే నీళ్లు పోయలేదేమో అంటూ మరో స్టూడెంట్ సమాధానం ఇవ్వడం నవ్వులను పూయిస్తుంది. సూపర్ కాలేజీ...గ్రేట్ ఫ్యాకల్టీ...హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్‌మెంట్...గొప్పగొప్పవాళ్లందరూ ఇక్కడే చదివారు...నేను కూడా ఇక్కడే చదివాను'' అని కాలేజీ వాచ్‌మెన్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. కాలేజీ స్టూడెంట్స్ మధ్య ఉండే గొడవలు, సరదాలు, లవ్ స్టోరీస్‌తో ట్రైలర్ ను చాలా బాగా కట్ చేశాడు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. ఈ ట్రైలర్‌లో డైరెక్టర్ అనుదీప్ గెస్ట్ రోల్ చేయడం విశేషం.
ఇందులో నార్నేనితిన్‌తో పాటు సంగీత్‌శోభన్, రామ్ నితిన్ కూడా హీరోలుగా నటిస్తున్నారు.వీరికి శ్రీ గౌరిప్రియారెడ్డి, అనంతిక, గోపికా ఉద్యాన్ జోడిలుగా కనిపించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై హారిక సూర్యదేవర, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నాడు.
ముఖ్యంగా కాలేజ్ బ్యాక్‌గ్రాప్‌లో తెరకెక్కే సినిమాలకైతే యూత్‌లో ఓ రేంజ్‌లో హైప్ ఉంటుంది. హ్యాపిడేస్, కొత్త బంగారు లోకం, సై లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచనాలు సృష్టించాయో మనందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో అదిరిపోయే సినిమా అయితే రాలేదు. మరి ఆ లోటును మ్యాడ్ సినిమా తీరుస్తుందో లేదో చూడాలి.
Also Read: LGM Movie: ఎల్‌జీమ్ తెలుగు ఓటీటీ వెర్షన్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి