Zee Telugu Dance India Dance Auditions: జీ తెలుగు ఇప్పటికే అనేక రియాలిటీ షోలు నిర్వహించి వాటి ద్వారా సినీ పరిశ్రమకు సరికొత్త గాయనీ గాయకులను,  అనేక మంది డాన్స్ కొరియోగ్రాఫర్లను అందించిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న జీ తెలుగు ఇప్పుడు ఒక సరికొత్త డాన్స్ రియాలిటీ షోతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దేశవ్యాప్తంగా పేరుగాంచిన 'జీ నెట్వర్క్'కు సంబంధించిన ప్రీమియం రియాలిటీ షో ''డాన్స్ ఇండియా  డాన్స్'' ఇప్పుడు తెలుగులో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలోనే తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న అద్భుతమైన డాన్సర్స్ ని వెతికి పట్టుకునేందుకు ''డాన్స్ ఇండియా  డాన్స్'' జూన్ 23 నుంచి ఆడిషన్స్ నిర్వహిస్తోంది. నిజానికి మిగతా భాషలతో పోలిస్తే "డాన్స్ ఇండియా డాన్స్ - తెలుగు" కాన్సెప్ట్ కాస్త భిన్నంగా ఉండబోతుంది. ఇప్పటికే వరంగల్, ఖమ్మం, కర్నూల్, విజయవాడ, తిరుపతి, మరియు వైజాగ్ లో నిర్వహించబడిన ఆడిషన్స్ కి వందలాది డాన్సర్స్ ఎంతో ఉత్సాహంతో తరలివచ్చారు. క్లాసికల్, ఫోక్, వెస్ట్రన్, ఇలా పలు డాన్స్ ఫార్మ్స్ లో ప్రావీణ్యం కలిగిన అద్భుతమైన డాన్సర్స్ 'జీ తెలుగు' కంటబడ్డారు. ఇక ఇప్పుడు ఈ అవకాశం హైదరాబాద్ ప్రజలకు కూడా రానుంది. జూలై 3న ఈ రియాలిటీ షో యొక్క చివరి దశ ఆడిషన్స్ రామానాయుడు స్టూడియోస్ లో జరగనున్నాయి. 


డాన్స్ మీద ఆసక్తి ఉన్న 6 నుండి 60 సంవత్సరాల వయస్సు కలిగిన ఎవరైనా ఈ ఆడిషన్స్ లో పాల్గొనవచ్చు. అయితే  అక్కడికి వెళ్ళే అవకాశం లేని ఆశావహులు ఎవరైనా ఉంటే వారు డిజిటల్ ఆడిషన్స్ లో కూడా పాల్గొనే అవకాశం కల్పిస్తోంది జీ తెలుగు. ఆసక్తి ఉన్న వారు డాన్స్ వీడియో షూట్ చేసి 9154984009 నెంబర్ కి వాట్సాప్ చేయాల్సి ఉంటుంది. లేదా did.zeetelugu@gmail.com కి ఇమెయిల్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండూ కాకుంటే కనుక 'didtelugu.zee5.com కు లాగిన్ అవ్వడం ద్వారా కూడా డ్యాన్స్ వీడియోలను పంపవచ్చు. ఆలసించిన ఆశాభంగం, ఆసక్తి ఉన్న మీ బంధు మిత్రులకు,  కూడా ఈ సమాచారాన్ని వెంటనే షేర్ చేయండి.


Also Read: Nithya Menon Leg Fracture: నిత్యమీనన్ కు గాయాలు.. నడవలేని స్థితిలో హీరోయిన్.. ఏమైందంటే?


Also Read: Allu Arjun No.1 : సౌత్ లో దుమ్మురేపిన అల్లు అర్జున్.. అందరినీ వెనక్కు నెట్టి ముందుకు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.