Zee Telegu Mahasangamam with Trinayani and Mukkupudaka: క్రాస్ ఓవర్ ఎపిసోడ్స్ తో ఆసక్తి రేకెత్తిస్తున్న జీ తెలుగు ఇప్పుడు మరో క్రాస్ ఓవర్ ఎపిసోడ్ తో మహా సంగమం పేరిట అలరించడానికి సిద్ధమైంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా బోనాలు పండుగలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ బోనాలు నేపథ్యంలోనే ఒక క్రాస్ ఓవర్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ముక్కుపుడక- త్రినయని రెండు సీరియల్స్ మహా సంగమం పేరిట క్రాస్ ఓవర్ ప్లాన్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జులై 20వ తేదీ అంటే బుధవారం రాత్రి 8 గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రసారం కానున్న ఈ మెగా క్రాస్ ఓవర్ ఎపిసోడ్ ఆద్యంతం పలు మలుపులతో కూడి ఉత్కంఠభరితంగా సాగేలా తీర్చిదిద్దినట్లు సమాచారం. నయని, సుమనా, హాసిని వారి కుటుంబ సభ్యులు అమ్మవారి గుడిలో వేదవతి ఆమె కుటుంబ సభ్యులకు ఎదురు పడడంతో ఎపిసోడ్ మొదలవుతుంది. అదే సమయంలో శ్రీకర్ కూడా అవనితో కలిసి బోనాలు ఉత్సవాలను వీక్షించేందుకు గుడికి వస్తారు.


అయితే ఎప్పటినుంచో అవనిపై పగ తీర్చుకోవాలని ఎదురుచూస్తున్న సురేంద్ర అవనిని గుడి వద్ద చూడగానే ఆమె చీరకు నిప్పంటించి చంపివేయాలని నిశ్చయించుకుంటాడు మరోవైపు కడుపుతో ఉన్న నయనిని ఎలా అయినా చంపాలని తిలోత్తమ కూడా మరో ప్లాన్ వేస్తుంది. వారిద్దరినీ సురేంద్ర, త్రిలోత్తమల బారి నుంచి ఎవరు కాపాడుతారు? అనేది ఈ ఎపిసోడ్లో హైలెట్ గా ఉంటుందని అంటున్నారు. త్రినయని సహా ముక్కుపుడక కూడా జీ తెలుగులో ప్రసారమయ్యే సీరియల్స్ లో మంచి పేర్లు తెచ్చుకున్నాయి. అయితే మహా సంగమం పేరిట కలవనున్న తాజా ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగనుందని అంటున్నారు. మీరు కూడా మిస్ కాకుండా ఈ మహా సంగమం చూసేయండి మరి. 
Also Read: Bindu Madhavi Pics: బుక్ పట్టిన బిందు మాధవి.. అమ్మడిలో ఈ కళ కూడా ఉందా?


Also Read: Ileana D'cruz: బికినీతో కాక రేపిన ఇలియానా డిక్రూజ్.. అందాలన్నీ కనిపించే విధంగా!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook