Vikatakavi: వికటకవి వెబ్ సిరీస్ తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కు రానుంది. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. ఈ వెబ్ సిరీస్ ను జీ5తో కలిసి SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఈ సిరీస్ నిర్మించారు. ఈ వెబ్‌సిరీస్ ‘స‌ర్వం శ‌క్తిమ‌యం’ను ఫేమ్ డైరెక్టర్  ప్రదీప్ మద్దాలి డైరెక్ట్ చేశారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ గా రాబోతుంది. ఈ పీరియాడిక్ సిరీస్ గురించి దర్శకుడు ప్రదీప్ మద్దాలి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘వికటకవి’ ప్ర‌యాణం ఎలా మొద‌లైంది?


ప్ర‌శాంత్ వ‌ర్మ‌గారితో అ!, ‘క‌ల్కి’ సినిమాల‌కు వ‌ర్క్ చేసిన రైట‌ర్ తేజ దేశ్‌రాజ్‌ రాసుకున్న క‌థ‌. త‌ను నాకు మంచి ఫ్రెండో. జీ5 వారికి క‌థ‌ను వినిపించి సిరీస్‌ను చేయ‌టానికి ఒప్పించి ఈ వెబ్ సిరీస్ రూపొందించాము.  క‌థ విన్నాకా.. నాకు చాలా చాలెంజింగ్  అనిపించింది. ఎస్ఆర్‌టి ఎంట‌ర్‌టైన్‌మెంట్ రామ్ తాళ్లూరి, జీ5 టీమ్ ఓ బ‌డ్జెట్ చెప్పి అందులోనే కంప్లీట్ చేయగ‌ల‌వా? అన్నారు. నేను ఓకే చెప్పాను.  అక్క‌డి నుంచి విక‌ట‌క‌వితో నా ప్ర‌యాణం ప్రారంభ‌మైంది.


* పీరియాడిక్ జోన‌ర్‌లో సిరీస్‌ను చేయ‌టం ఎలా అనిపించింది.


విక‌ట‌క‌వి త‌ర‌హా పీరియాడిక్ సిరీస్ డైరెక్ట్ చేయడం ఓ కొత్త  ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. నాతో పాటు నా టీమ్‌కి కూడా వ‌ర్క్ ప‌రంగా డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చిన కంటెంట్ అని చెప్పాలి. ఎందుకంటే క‌థ‌లో చాలా లేయర్స్ ఉన్నాయి. క‌థంతా 1940, 1970 కాలాల్లో జ‌రుగుతుంది. అలాంటి ప్ర‌పంచాన్ని క్రియేట్ చేసి తెర‌కెక్కించ‌టం అనేది ఓ ఛాలెంజ్.  1940, 1970 కాలాల‌కు సంబంధించిన సెట‌ప్స్‌, కాస్ట్య్యూమ్స్, అప్ప‌టి ప్ర‌జ‌లు మాట్లాడే భాష‌, యాస, లుక్స్‌, లైటింగ్, వ‌ర్కింగ్ మూడ్ ఇలా అన్నీ టీమ్‌కి చాలెంజింగ్‌గా అనిపించింది. సిరీస్‌ను కంటెంట్ ప్ర‌కారం ఓ రాయ‌ల్ లుక్‌తో చూపిస్తూనే క‌థానుగుణంగా మంచి థ్రిల్ల‌ర్ ఎలిమెంట్‌తో తెర‌కెక్కించాను.


* పీరియాడిక్ కాన్సెప్ట్‌తో సిరీస్‌ను తెర‌కెక్కించ‌టం అనేది ద‌ర్శ‌కుడిగా మీకు ఎలా చాలెంజింగ్ అనిపించింది?


- పీరియాడిక్ కాన్సెప్ట్‌తో సిరీస్ లేదా సినిమాను తెర‌కెక్కించ‌టం అనేది ప్ర‌తి ఒక్క టెక్నీషియ‌న్‌కి ఎంతో చాలెంజింగ్ తో కూడిన విష‌యం అని చెప్పాలి. ప్ర‌తీ చిన్న విష‌యాన్ని చాలా జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించాలని చెప్పాలి. కంటెంట్‌ను పేజీపైనే కాదు.. తెరపైకి తీసుకురావడం కూడా ఓ ఛాలెంజింగ్ అని చెప్పాలి.


మేకింగ్‌లో సినిమాటోగ్రాఫ‌ర్ వ‌ర్కింగ్ స్టైల్ గురించి చెప్పండి?


- విక‌ట‌క‌వి సిరీస్‌కు షోయ‌బ్ అనే సినిమాటోగ్రాఫ‌ర్ పని చేశారు. త‌ను ఓ ప్రాజెక్ట్ చేశాడు. మూడు వంద‌ల‌కు పైగా పంజాబీ సాంగ్స్‌కి వ‌ర్క్ చేసిన అనుభవం ఉంది. అది ఈ సిరీస్ కు ఉపయోగపడింది.  


* విక‌ట‌క‌వి సిరీస్ కోసం ఎన్ని సెట్స్ వేశారు?


- సిరీస్‌లో చూపించిన ప్యాలెస్ సెట్‌.. అలాగే అవ‌స‌ర‌మైన చోట మాత్ర‌మే గ్రాఫిక్స్ ఉపయోగించాము.  ఎక్కువగా రియ‌ల్ లోకేష‌న్స్‌లోనే షూట్ చేశామన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ, అల్యూమినియం ఫ్యాక్ట‌రీ వంటి చోట్ల లోకేష‌న్స్‌లోనే చిత్రీక‌రించాము. అయితే ఉన్న లొకేష‌న్స్‌ను క‌థ‌కు త‌గ్గ‌ట్టు మార్చుకున్నాం.


* అమ‌రగిరి సంస్థానం అనే కాన్సెప్ట్‌ను క‌థ‌లో ఎంచుకోవ‌టానికి కార‌ణమేంటి?


- స్వాతంత్య్రం రాక ముందు మ‌న దేశంలో చాలా సంస్థానాలుండేవి. అలాంటి వాటిలో తెలంగాణ‌కు చెందిన అమ‌ర‌గిరి ప్రాంతం ఒక‌టి. రైట‌ర్ తేజ డిఫ‌రెంట్ క‌థ‌ను చెప్పాల‌నుకున్న‌ప్పుడు త‌న మైండ్‌లో వ‌చ్చిన ఆలోచన ఇది. శ్రీశైలం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తున్నారు. కొన్నాళ్ల‌లో ఊరు మునిగి పోతుంది.. అనే బ్యాక్ డ్రాప్ క‌థ‌తో విక‌ట‌క‌వి అనే ఫిక్ష‌న‌ల్ పాయింట్‌ను తీసుకున్నారు.


* ఫిక్ష‌న‌ల్ డిటెక్టివ్ సిరీస్‌కు విక‌ట‌క‌వి అనే టైటిల్‌ను ఎందుకు పెట్టారు?


- క‌థ‌కు విక‌ట‌క‌వి అనే టైటిల్‌ను పెట్టింది రైట‌ర్ తేజ‌. నిజానికి మ‌న తెలుగు సినిమాల్లో విక‌ట‌క‌వి అంటే శ్రీకృష్ణదేవరాయ‌ల సంస్థానంలో ప‌ని చేసిన తెనాలి రామ‌కృష్ణుడు హ‌స్య చ‌తుర‌త క‌లిగిన క‌వి అనే ఫీలింగ్ ఉంది. దీనిపై తెలుగులో సినిమాలు కూడా వ‌చ్చాయి. మ‌న‌ది ఫిక్ష‌న‌ల్ డిటెక్టివ్ సిరీస్ క‌దా. ఎందుకు విక‌ట‌క‌వి అనే టైటిల్ పెట్టార‌ని నేను అడిగాను. దానికి ఆయ‌న తెనాలి రామ‌కృష్ణుడు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లుగారి ద‌గ్గ‌ర గూఢ‌చారిగా ప‌ని చేశారు. బ‌హ‌మ‌నీ సుల్తానుల నుంచి రాయ‌ల‌వారి రాజ్యాన్ని కాపాడ‌టంలో ఎంతో కీల‌క పాత్ర‌ను పోషించిన విషయాన్ని గుర్తు చేశారు.  మ‌న క‌థ‌లో హీరోకు అలాంటి షేడ్స్ ఉండ‌టంతో విక‌ట‌క‌వి అనే టైటిల్ పెట్టాన‌ని తేజ చెప్పారు.


* న‌రేష్ అగ‌స్త్య‌ను హీరోగా ఎంచుకోవ‌టానికి రీజ‌నేంటి?


- నేను డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇవ్వ‌క ముందు మేక‌ర్స్ కొంత మంది హీరోల‌ను అప్రోచ్ అయ్యారు. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. నేను బోర్డ్ పైకి వ‌చ్చిన త‌ర్వాత న‌రేష్ అగ‌స్త్య పేరుని సూచించాను. అందుకు కార‌ణం.. ఆయ‌న రాజేంద్ర‌ప్రసాద్‌తో న‌టించిన సేనాప‌తి, మ‌త్తువ‌ద‌ల‌రా  చూశాను. త‌న యాక్టింగ్ న‌న్నెంతో ఆక‌ట్టుకుంది. దాంతో నేను న‌రేష్ పేరుని స‌జెస్ట్ చేశాను.* న‌రేష్ అగ‌స్త్య పాత్ర‌ను ఎలా డిజైన్ చేశారు?


- తెనాలి రామ‌కృష్ణుడి పాత్ర‌లోని చతుర‌త మిస్ కాకుండా ఉండేలా న‌రేష్ క్యారెక్ట‌ర్‌ను డిజైన్ చేశాం. హైద‌రాబాద్‌లో ఉండే ఓ యువ‌కుడు అప్ప‌ట్లో ఉర్దూ, తెలుగు మాట్లాడుతూ ఎలా ఉండేవాడ‌నే దానిపై రీసెర్చ్ చేసి త‌న పాత్ర‌ను రాసుకున్నాము.


* మేఘా ఆకాష్ పాత్ర ఎలా ఉండ‌బోతుంది?


అమ‌ర‌గిరి యువ‌రాణి పాత్రలో మేఘా ఆకాష్ న‌టించింది. త‌ను సైక్రియాటిస్ట్ చ‌దువుకుంటున్న డాక్ట‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తుంది.


* అమ‌ర‌గిరి ప్రాంతంలోని ఏ ర‌హ‌స్యాన్ని మీరు చూపించ‌బోతున్నారు?


- 1940ల్లో అమ‌ర‌గిరి ప్రాంతంలో ఓ ఘ‌ట‌న ఆ ప్రాంతాన్ని పీడిస్తూ ఉంటుంది.  1970లో అది మ‌ళ్లీ అదే తరహా ఘటన పునరావృతమవుతోంది.  ఉంటుంది.  అలా జ‌ర‌గ‌టాన్ని అక్క‌డి ప్రజ‌లు అమ్మోరు శాపంగా భావిస్తుంటారు. నిజంగానే అది అమ్మోరు స‌మ‌స్యా? అని హీరో అక్క‌డ‌కు వ‌చ్చి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేసాడనేదే ఈ వెబ్ సిరీస్ లక్ష్యమన్నారు.


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter