నేటి అంతర్జాల యుగంలో అంతా ఆన్‌లైన్ మయమైపోయింది. అకౌంటింగ్ పనుల దగ్గర నుండి రాత పనుల వరకు ప్రభుత్వం కూడా ఆన్ లైన్ మార్గాన్నే అనుసరిస్తోంది. దాదాపు క్లరికల్ జాబ్స్ అన్నీ కూడా ఆన్ లైన్ విధానంలో జరుగుతున్నాయి. బ్యాంకింగ్ పనులకు కూడా ఆన్ లైన్ పద్ధతులే ఆయువుపట్టు. ఈ క్రమంలో యువత కూడా ఆన్ లైన్ ద్వారా డబ్బులు సంపాదించడానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఓ కంప్యూటర్ కొనుక్కొని.. దానికి ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకొని.. టాలెంట్ ఉంటే రెగ్యులర్‌గా ఆన్‌లైన్ ద్వారా  డబ్బులు సంపాదించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్ని మీకోసం..!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1.యూట్యూబ్ వీడియోలు: మీకు మంచి వీడియో మేకింగ్, ఎడిటింగ్ నాలెడ్జి ఉంటే.. వివిధ కాన్సెప్ట్స్ మీద యూట్యూబ్ వీడియోలు తయారుచేయవచ్చు. ఆ వీడియోలకి వచ్చే క్లిక్స్ ద్వారా గూగుల్ సంస్థ నుండి ఆదాయాన్ని కూడా పొందవచ్చు. విలేజ్ ఫుడ్ ఫ్యాక్టరీ,  విక్రమాదిత్య ఛానల్ లాంటివి అందుకు ఉదాహరణ.


2.మొబైల్ టిప్స్: మీకు లేటెస్ట్ గ్యాడ్జెట్స్, మొబైల్ సాఫ్ట్ వేర్ల మీద అపరిమితమైన నాలెడ్జి ఉందా.. అయితే ఈ టిప్స్ మీరు వీడియోల రూపంలో అందివ్వండి. ఆ విధంగా కూడా మీరు అదనపు ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ఉదాహరణకు తెలుగు టెక్ టెక్స్ వీడియోలు చూడండి. 


3.షార్ట్ ఫిల్మ్స్: మీలో మంచి లఘు చిత్ర దర్శకుడు ఉన్నారా.. అయితే ఇంకెందుకు ఆలస్యం.. మెగాఫోన్ పట్టుకోండి. మీరే తక్కువ వ్యవధి గల మంచి చిత్రాలను తీయండి. ఉదాహరణకు మిస్టర్ ప్రొడక్షన్స్ లాంటి వారు ప్రొడ్యూస్ చేసిన యూట్యూబ్ వీడియోలు చూడండి.


4.పుస్తకాలు రాసి కూడా డబ్బు సంపాదించవచ్చు: మీలో మంచి రైటర్ దాగి ఉన్నారా.. అయితే మీరు ఆన్ లైన్‌లో పుస్తకాలు రాసి కూడా డబ్బు సంపాదించవచ్చు. నేడు ఈబుక్స్ కొనేవారి సంఖ్య పెరిగింది. అమెజాన్ కిండెల్, కినిగె లాంటి సైట్లలో మీరు ఈబుక్స్ అప్లోడ్  కూడా చేయవచ్చు. 


5.బ్లాగింగ్: బ్లాగింగ్ పద్ధతి పాతదైనా.. ఆ పద్ధతి ద్వారా కూడా డబ్బు సంపాదించేవారు అనేకమంది ఉన్నారు. మీకు మంచి సబ్జె్క్ట్ నాలెడ్జి ఉంటే మీరు బ్లాగ్‌తో మొదలు పెట్టి వెబ్ సైట్ కూడా తయారుచేసుకోవచ్చు. ఆ సైట్స్‌కి వచ్చే క్లిక్స్ ద్వారా యాడ్ సెన్స్ రూపంలో కూడా డబ్బు గడించవచ్చు.ఉదాహరణకు గిజ్ మోడో బ్లాగ్ చూడండి.


6.ఆన్ లైన్ ట్యూటర్: మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టులను ఆన్ లైన్ ద్వారా బోధించగలరా.. అయితే మీరు ఆ విధంగానూ సంపాదన పొందవచ్చు. ఉదాహరణకు ట్యూటర్ విస్టా వారి సైట్ చూడండి.


7.భాషలను నేర్పించి కూడా డబ్బులు సంపాదించవచ్చు: మీరు తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, భాషలను ఆన్ లైన్ ద్వారా నేర్పించి కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఉదాహరణకు ఐటాకీ.కామ్ వెబ్ సైట్ చూడండి.


8.ఆన్ లైన్ ద్వారా మీరు చేసిన వంటలు విక్రయించి కూడా డబ్బులు సంపాదించవచ్చు: మీరు కేక్స్, బిర్యానీ, పేస్ట్రీ లాంటివి తయారుచేయగలుగతారా.. అయితే వాటిని ఆన్ లైన్ ద్వారా విక్రయించి కూడా డబ్బులు సంపాదించవచ్చు. అయితే అందుకు మీరు ముందుగా కొంత ఇన్వెస్ట్ మెంట్ చేసి షాపింగ్ వెబ్ సైట్ డిజైన్ చేసుకోవాలి.


9.ఆన్ లైన్ కౌన్సలర్: మీరు డాక్టర్, సైకాలజిస్ట్ లేదా ఫైనాన్షియల్ అడ్వైజరా.. అయితే మీరు ఆన్ లైన్ ద్వారా ఇతరులకు కౌన్సిలింగ్ లేదా సలహాలు ఇస్తూ కూడా డబ్బు సంపాదింవచ్చు. ఉదాహరణకు.. టాక్ స్పేస్ వెబ్ సైట్ చూడండి.


10.డేటా ఎంట్రీ జాబ్స్: మీరు డేటా ఎంట్రీ లాంటి పనులు ఇంటిలో కూర్చొని చేయాలని భావిస్తున్నారా.. అయితే అలాంటి వారికోసం ప్రాజెక్టులు అందివ్వడానికి కూడా కొన్ని సైట్లు రెడీగా ఉన్నాయి. ఉదాహరణకు అప్ వర్క్ డాట్ కామ్ వెబ్ సైట్ చూడండి.


11.రివ్యూ రైటర్: ఆన్ లైన్‌లో సినిమాలకు, ప్రొడక్ట్స్‌కు రివ్యూలు రాస్తూ కూడా డబ్బు సంపాదింవచ్చు. ఉదాహరణకు యూజర్ టెస్టింగ్ డాట్ కామ్, స్క్రీన్ రాంట్ డాట్ కామ్ లాంటి వెబ్ సైట్లు చూడండి.


12.గూగుల్ సెర్చర్స్: కొంతమందికి కావాల్సిన సమాచారాన్ని మీరే గూగుల్ ద్వారా సెర్చ్ చేసి వారికి అందించి.. ఆదాయాన్ని పొందవచ్చు. ఉదాహరణకు క్యూమీ.కామ్ సైట్ చూడండి.


13.ఆన్ లైన్‌లో వస్తువులు అమ్ముతూ కూడా డబ్బులు సంపాదించవచ్చు: ఆన్ లైన్ ద్వారా సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అమ్ముతూ కూడా డబ్బు సంపాదింవచ్చు. ఉదాహరణకు క్వికర్, క్యాషీఫై, కర్మా రీసైక్లింగ్ లాంటి సైట్లు చూడండి.


14.డొమైన్స్ అమ్మి కూడా డబ్బులు సంపాదించవచ్చు: మీ మనసులో ఏదైనా క్యాచీ టైటిల్ ఉందా.. ఆ టైటిల్ పేరుతో వెబ్ సైట్ డొమైన్స్ కొనండి. తర్వాత ఆ డొమైన్ నేమ్‌ను పబ్లిసిటీ చేసి ఆసక్తి ఉన్న వారికి తిరిగి అమ్మండి. డొమైన్స్ కొనడానికి గోడాడీ.కామ్ లాంటి సైట్లు చూడండి.


15.అఫిలీయేట్ మార్కెటింగ్: పలు సంస్థల వెబ్ సైట్స్ కోడ్స్‌ను మీ పర్సనల్ వెబ్ సైట్ ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తూ.. పొడక్ట్స్ అమ్మకాలపై వచ్చే కమీషన్ పొందడమే అఫిలీయేట్ మార్కెటింగ్


16.యాప్ డిజైనింగ్: పలు ఆసక్తికరమైన అంశాలతో మొబైల్ యాప్స్ డిజైన్ చేసి కూడా డబ్బు సంపాదించవచ్చు. నేడు యాప్ డిజైనింగ్ కూడా ఈజీగా చేసే పద్దతులు వచ్చేశాయి. ఉదాహరణకు ఐబిల్డ్ యాప్.కామ్ లాంటి వెబ్ సైట్లు చూడండి.


17.టీ షర్ట్ డిజైనింగ్: మీలో మంచి ఆర్టిస్ట్ ఉన్నారా.. మీరు మంచి టీషర్ట్ డిజైన్ చేయగలరా.. అయితే ఇంకెందుకు ఆలస్యం.. ఓ మంచి డిజైన్ చేసి డబ్బులు సంపాదించండి. ఉదాహరణకు టీ స్ప్రింగ్ వెబ్ సైట్ చూడండి.


18.లోగో డిజైనింగ్: మీరు సంస్థలకు సంబంధించిన మంచి లోగోలు డిజైన్ చేయగలరా.. అయితే మీలాంటి వారికోసమే బ్రాండ్ క్రౌడ్. కామ్, లోగో గ్రౌండ్. కామ్ లాంటి సైట్లు సేవలందిస్తున్నాయి. 


19.ఆన్ లైన్ కాంపిటీషన్స్: మీరు ఆన్ లైన్ ద్వారా క్విజ్ ప్రోగ్రామ్స్ లేదా కాంపిటీషన్స్ కూడా కండెక్ట్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. ప్రవేశ రుసుము తీసుకొని నిర్వహించే అలాంటి పోటీలకు ప్రభుత్వ పర్మిషన్‌తో పాటు సొంత వెబ్ సైట్ ఉండాలి. 


20.పోస్టర్ డిజైనింగ్: సినిమా పోస్టర్లు డిజైన్ చేసి కూడా డబ్బులు సంపాదించాలి. అయితే ముందు శాంపిల్ పోస్టర్లు డిజైన్ చేసి అందించమని పలు ఏజెన్సీలు అడుగుతుంటాయి. అలాంటి ఆన్ లైన్ ఏజెన్సీలతో మీరు టై అప్ అవ్వాల్సి ఉంటుంది. 


21.వెబ్ సైట్ కోడింగ్: పలు సంస్థలకు మీరు పార్ట్ టైమ్ వెబ్ సైట్ కోడర్లుగా కూడా పనిచేస్తూ.. ఇంటి నుండి డబ్బులు సంపాదించుకోవచ్చు. 


22.వర్చువల్ అసిస్టెంట్: కొన్ని కాల్ సెంటర్లు నేడు పార్ట్ టైమ్ కాలర్స్ కోసం రిక్రూట్ మెంట్ డ్రైవ్‌లు పెడుతున్నాయి. అలాంటి సంస్థల్లో మీరు కూడా జాయిన్ అయ్యి వర్చువల్ అసిస్టెంట్స్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. 


23.సోషల్ మీడియా మేనేజర్: కొన్ని సంస్థలు నేడు తమ ట్విటర్, ఫేస్ బుక్ ఖాతాలను మెయిన్ టైన్ చేయడానికి.. ఫీలాన్స్ మేనేజర్లను రిక్రూట్ చేసుకుంటున్నాయి. అటువంటి పార్ట్ టైమ్ జాబ్స్‌కి మీరు కూడా అప్లై చేయవచ్చు. 


24.జీపీటీ ప్రోగ్రామ్: కొన్ని సంస్థలు సర్వేల్లో మిమ్మల్ని భాగస్వాములను చేయడంతో పాటు వారి యాడ్స్‌ను మీరు క్లిక్ చేస్తే డబ్బులు అందిస్తామని చెబుతుంటాయి. కానీ ఈ మధ్యకాలంలో ఈ ఆఫర్లకు ఆదరణ తగ్గుముఖం పడుతోంది. 


25.ఫోటోల అమ్మకం: మీరు మంచి ఫోటోగ్రాఫరా.. అయితే ఇంకెందుకు ఆలస్యం.. మంచి మంచి ఫోటోలు తీస్తూ వాటిని ఆన్ లైన్ ఫోటో ఏజెన్సీలకు అమ్మి డబ్బులు సంపాదించండి. షటర్ స్టాక్ లాంటి సంస్థలు కొత్త ఫోటోగ్రాఫర్లకు మంచి అవకాశాలిస్తున్నాయి. 


26.స్టాక్ మార్కెట్, ట్రేడింగ్: మీకు స్టాక్ మార్కెట్ రంగంలో, ట్రేడింగులో మంచి నైపుణ్యం ఉందా.. అయితే మీలాంటి వారికి ఆన్ లైన్ ద్వారా మంచి అవకాశాలు అందివ్వడానికి అనేక ఏజెన్సీలు రెడీగా ఉన్నాయి. అలాంటి వాటిలో పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవచ్చు. 


27.ట్రాన్స్‌క్రిప్షన్: మీకు మంచి వినికిడి సామర్థ్యం.. భాష మీద పట్టు ఉందా.. అయితే మీరు ఆడియోటేపులు విని.. వాటిని డాక్యుమెంట్లుగా మార్చే ట్రాన్స్ క్రిప్షన్ జాబ్స్‌కు కూడా ఆదరణ పెరిగింది. ఉదాహరణకు ట్రాన్స్‌క్రైబ్ మీ లాంటి వెబ్ సైట్లు వీక్షించండి. 


28.మ్యాట్రిమోనీ సైట్ నిర్వహణ: మీకు మంచి సోషల్ కాంటాక్ట్స్ ఉండి వివాహ వేదికను నిర్వహించాలని భావిస్తున్నారా.. అయితే నేడు ఆన్ లైన్ వెబ్ సైట్ నిర్వహిస్తూ కూడా ఆ పని చేయవచ్చు. అయితే ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి తప్పనిసరి. 


29.మొబైల్ మార్కెటింగ్: ఎస్మె్మ్సెస్‌లు పంపించడం, న్యూస్ లెటర్స్ నోటిఫికేషన్లు పంపించడం వంటివి ఈ మొబైల్ మార్కెటింగ్‌లోకి వస్తుంటాయి. ఆన్ లైన్‌లో ఈ జాబ్స్‌కి కూడా మంచి డిమాండ్ ఉంది.


30.ఆన్ లైన్ జర్నలిస్ట్: మీకు మంచి రిపోర్టింగ్ సామర్థ్యం ఉందా.. అయితే మీరు సిటిజన్ జర్నలిస్టుగా పనిచేస్తూ లోకల్ వార్తలను జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలకు కూడా చేరవేయచ్చు.