ఆ చిన్నారి పాప వయసు 7 నెలలు మాత్రమే. అయితేనేం. ఆమెకు సోషల్ మీడియాలో వీరాభిమానులు ఉన్నారు. అయితే ఆ పాప చిట్టి బుగ్గలను చూసో లేదా గుండ్రని కళ్లను చూసో వారు ఫ్యాన్స్ అవ్వలేదు. మరి ఆ చిన్నారిలో ఏం చూసి అంతమంది ఫ్యాన్స్ అయ్యారో తెలుసా.. ఆమె అందమైన కేశాలు చూసి. "అమ్మో.. ఎంత ఎక్కువ జట్టు ఉందో.. భలే అందంగా ఉంది పాప" అని ఇప్పటికే ఆ చిన్నారి చిత్రాలకు చాలామంది కామెంట్లు కూడా పెట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఆ చిన్నారి పాప ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఉన్న పోస్టుల సంఖ్య ఎంతో తెలుసా.. కేవలం 47 మాత్రమే. ఆ 47 పోస్టులకే 1.5 లక్షల ఫ్యాన్స్ ఉండడంతో ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతైంది. కనీసం మాట్లాడడం లేదా పాకడం కూడా రాని ఆ చిట్టి బేబీకి వస్తున్న అంత ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి మురిసిపోతున్నారు ఆ బిడ్డ తల్లిదండ్రులు. ఇంతకీ ఆ చిన్నారి పేరేమిటో తెలుసా.. బేబీ చాంకో. బేబీ చాంకో ఇప్పుడు నెటిజన్ల ఆదరణతో సూపర్ చాంకో అయ్యింది. ఈ మధ్యకాలంలో ఆ పాపకి సంబంధించిన వీడియోలను కూడా పోస్టు చేస్తున్నారు తన తల్లిదండ్రులు. 


అయితే కేవలం నిగనిగలాడే కేశాలతోనే ఈ పాపకు అంత పాపులారిటీ వచ్చిందంటే పొరపాటే. ఆ నెలల వయసులోనే ఆ చిన్నారి ఫోటోలకు ఇస్తున్న ఎక్స్‌ప్రెషన్స్, కెమెరాకు ఇస్తున్న ఫోజులు కూడా తనకు కావాల్సిన ఫ్యాన్ బేస్‌తో పాటు ఫాలోయింగ్‌ని కూడా తీసుకొచ్చాయి. ఆ పాప కోసం తన తల్లిదండ్రులు పెట్టే ప్రతీ పోస్టుకి కనీసం అయిదు వేలకు తగ్గకుండా లైకులు, షేర్లు వస్తున్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు.. బేబీ చాంకో ఎంత పెద్ద సెలబ్రిటీ అయిపోయిందో..? అలాగే సోషల్ మీడియాలో ఇంతమంది ఫాలోవర్లను సాధించుకున్న ఆ పాప యంగెస్ట్ సోషల్ మీడియా ఐకాన్ కూడా కావచ్చని పలువురు అంటున్నారు.