Reason Behind Srinu Vaitla and Roopa Vaitla Divorce: ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు ఎంత కామన్ అయిపోయాయో విడాకులు కూడా అంతే కామన్ అయిపోయాయి. ఇప్పుడు దర్శకుడు శ్రీనువైట్ల ఆయన భార్య రూప వైట్ల ఇద్దరూ విడిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. శ్రీను వైట్ల విడిపోవడానికి ఆసక్తి చూపించకపోయినా రూపా వైట్ల విడిపోవాలని ఆసక్తి చూపిస్తూ ఆయనకు విడాకుల నోటీసులు పంపినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయో తెలియదు కానీ ఇప్పుడు సరికొత్త న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో అనేక సూపర్ హిట్ సినిమాలు అందించిన శ్రీను వైట్లకి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఆయన మంచి విష్ణుతో ఢీ సీక్వెల్ ప్రకటించారు కానీ ఆ సినిమా ఇప్పుడు ఆగిపోయింది అనే ప్రచారం నడుస్తోంది. అయితే రూప వైట్ల, శ్రీను వైట్ల నాలుగేళ్ల నుంచి విడివిడిగానే ఉంటున్నారని వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఒక హీరోయిన్ అనే ప్రచారం జరుగుతోంది. శ్రీను వైట్లకు సదరు హీరోయిన్ తో ఉన్న రిలేషన్ కారణంగానే రూప ఆయనకు దూరం అయ్యారు అనే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతోంది.


అయితే ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయో తెలియదు. కానీ ఈ మేరకు ప్రచారం అయితే మొదలయింది. నిజానికి రూప వైట్ల సమంతకు పర్సనల్ డిజైనర్ గా ఉండేవారు. అయితే ఆ బాధ్యతల నుంచి కూడా ఆమె సుమారు రెండేళ్ల క్రితం తప్పుకున్నారని తెలుస్తోంది. అయితే ఆమె వేదిక్ అనే ఒక ఆర్గానిక్ మిల్క్ స్టోర్ ప్రారంభించారని తెలుస్తోంది. ఈ మిల్క్ స్టోర్ ద్వారా ఆర్గానిక్ మిల్క్ ని ప్రజలందరికీ అందించాలనే ఉద్దేశంతో పని చేస్తున్నారట. ఇక శ్రీనువైట్ల ఢీ సీక్వెల్ కూడా క్యాన్సిల్ కావడంతో మరో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.


కానీ దాని మీద కూడా సరైన క్లారిటీ లేదు. అయితే ఈ హీరోయిన్ వ్యవహారం తెరమీదకి వచ్చింది కాబట్టి శ్రీనువైట్ల తన సోషల్ మీడియా వేదికగా ఏదైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగనుంది అనేది. 


Also Read: Samantha Ruth Prabhu: తెలుగు నుంచి సమంతకు అరుదైన గౌరవం.. మొదటి హీరోయిన్ గా!


Also Read: Chiranjeevi: చిరంజీవిపై సీపీఐ నారాయణ అనుచిత వ్యాఖ్యలు... చిల్లర బేరగాడంటూ!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook