Aadi Sai Kumar Krishna From Brindavanam: లవ్ లీ యంగ్ హీరో ఆది సాయి కుమార్ ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. మరోసారి తనకు ఇష్టమైన ఫ్యామిలీ జోనర్‌లో సరికొత్త మూవీని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. 'కృష్ణ ఫ్రమ్ బృందావనం' టైటిల్ అనౌన్స్‌ చేసి.. పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇక త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాకు వీరభద్రమ్ చౌదరి దర్శకత్వం వహిస్తుండగా..  లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తూము నరసింహా, జామి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. విలేజ్ డ్రామాతోపాటు ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషన్స్‌ ఇలా అన్ని అంశాలను క్యారీ చేస్తూ.. సరికొత్త డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్‌పై కూడా మూవీ టీమ్ గట్టి ప్లాన్‌తోనే ముందుకు వెళుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Narendra Modi: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల సిద్ధాంతం బై ద ఫ్యామిలీ, ఫర్ ద ఫ్యామిలీ.. ఆఫ్ ద ఫ్యామిలీ


రెగ్యూలర్ షూటింగ్‌ ప్రారంభానికి ముందు సంగీత పనుల్లో చిత్ర బృందం బిజీగా ఉంది. మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం ఆది సాయి కుమార్, దర్శకుడు వీరభద్రమ్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ గోవా వెళ్లారు. గతంలో ఆది సాయి కుమార్ నటించిన లవ్ లీ, ప్రేమ కావాలి, సుకుమారుడు.. లాంటి సూపర్ హిట్ సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించిన అనూప్ రూబెన్స్ ఇప్పుడు ఈ 'కృష్ణ ఫ్రమ్ బృందావనం’ సినిమాకు మరోసారి అద్భుతమైన సంగీతాన్ని, పాటలను రెడీ చేస్తున్నారు. 


జూన్ నుంచి 'కృష్ణ ఫ్రమ్ బృందావనం’ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. గతంలో ఆదితో కలిసి క్రేజీ ఫెలో సినిమాలో నటించిన దిగంగన సూర్యవంశీ ఈ చిత్రంలో మళ్ళీ ఆదితో కలిసి అలరించనుంది. ఇక ఈ సినిమాకి శ్యామ్ సినిమాటోగ్రఫీ చేస్తుండగా చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నారు. రాము మన్నార్ అద్భుతమైన డైలాగ్స్ రాస్తున్నారు. డ్రాగన్ ప్రకాష్, శంకర్ యాక్షన్ సీక్వెన్స్ లను డిజైన్ చేస్తున్నారు.          


నటీనటులు : ఆది సాయికుమార్, దిగంగనా సూర్యవంశీ, మురళీధర్ గౌడ్, 30 ఇయర్స్ పృధ్వీ, రఘు బాబు, అవినాష్, రచ్చ రవి, అశ్విని, శ్రీ దేవి, అలేక్య, స్నేహ, పద్మ, గిరిధర్, గోవర్ధన్, మాస్టర్ రిత్విక్, వెంకట్ నారాయణ, గురు రాజ్ తదితరులు


సాంకేతిక బృందం
==> బ్యానర్: లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్
==> నిర్మాత: తూము నరసింహ, జామి శ్రీనివాస్
==> స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వీరభద్రమ్ చౌదరి
==> DOP: శ్యామ్
==> మ్యూజిక్: అనూప్ రూబెన్స్
==> ఎడిటర్: చోటా కె ప్రసాద్
==> డైలాగ్స్: రాము మన్నార్
==> ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, శంకర్
==> PRO: సాయి సతీష్


Also Read: Rashmi Gautam: ట్రోలర్ కి రష్మీ షాకింగ్ రిప్లై.. రేపు నీ పిల్లలని చంపుతాడు జాగ్రత్త



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter