ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ (Sanjay Dutt) ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. శనివారం రాత్రి అస్వస్థతతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరిన సంజయ్ దత్.. సోమవారం మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ (Sanjay Dutt Discharged from Hospital) అయ్యారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఏ ఆందోళన అక్కర్లేదని (Sanjay Dutt Health Condition) చెప్పారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవడంతో కుటుంబసభ్యులు శనివారం ఆయనను ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్పించారు. Rana Daggubati వివాహంపై కోలీవుడ్ హీరో ఫన్నీ కామెంట్..!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్వాస సమస్య కరోనా లక్షణాల్లో ఒకటి కావడంతో శనివారం సంజయ్ దత్‌కు వైద్యులు కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు చేశారు. టెస్టుల్లో నెగటివ్‌గా తేలిందని రిపోర్ట్ వచ్చినట్లు అదేరోజు తెలిపారు. ప్రస్తుతం శ్వాస సమస్య నుంచి బయటపడటంతో లీలావతి ఆస్పత్రి వైద్యులు సంజయ్ దత్‌ను డిశ్ఛార్జ్ చేశారు. ఏఎన్ఐ మీడియాతో మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉన్నానని నిర్ధారించిన వైద్యులు డిశ్ఛార్జ్ చేశారని నటుడు తెలిపారు. RGV లెస్బియన్ నటి Naina Ganguly హాట్‌ ఫొటోలు


Photos: రానా పెళ్లిలో సమంత సందడే సందడి