మతంపై షారుక్ ఆసక్తికర వ్యాఖ్యలు.. నెటిజన్లు ఫిదా
Shah Rukh Khan తన భార్య గౌరీ హిందువు అని, తాను ముస్లింనని చెప్పిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్.. తన పిల్లలకు మాత్రం మన మతం భారతీయత అని చెప్పిన వీడియో వైరల్ అవుతోంది.
దేశంలో అసహనం, మత విధ్వేషాలు అప్పుడప్పుడూ సామాన్య పౌరులకు చికాకు కలిగిస్తుంటాయి. భిన్నత్వంలో ఏకత్వంతో ముందుకు సాగుతున్న భారతీయులు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ మాటలు వింటే ఫిదా అయిపోతారు. ఆయన మాటలకు సలాం కొడతారు. ఇంతకీ షారుక్ ఏమన్నారంటే.. తమ ఇంట్లో హిందువులు, ముస్లింలు అనే భేదాభిప్రాయాలు వచ్చే పరిస్థితి లేదన్నారు. తాను ముస్లిం అని, భార్య గౌరీ హిందువు అయితే తమ మతం అంటే ‘భారతీయులం’ అని గొప్పగా వ్యాఖ్యానించారు.
డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ రియాల్టీ షోలో పాల్గొన్న సందర్బంగా తమ ఇంట్లో వారి మతం గురించి చెప్పిన మాటలు వీడియో రూపంలో వైరల్ అవుతున్నాయి. షారుక్‌ను గౌరీ ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. వీరికి సంతానం కూతురు సుహానా. కుమారులు ఆర్యన్, అబ్రామ్ ఉన్నారు. కూతురు చిన్నతనంలో తనను మతం ఏంటి అని అడిగిందని, ఆ సమయంలో మనం ఇండియన్స్ (భారతీయులం) అని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. నీల్ జోషి అనే నెటిజన్ ఈ వీడియోను ట్వీట్ చేశాడు.
నా భార్య హిందువు, నేను ముస్లింను, నా పిల్లలు భారతీయులు అని షారుక్ ఖాన్ చెప్పిన మాటల్ని టైటిల్‌గా ఉన్న వీడియో వైరల్ అవుతోంది. నిన్ను చూసి దేశం గర్విస్తుందంటూ ఆ నెటిజన్ చేసిన వీడియో పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది. షారుక్ ఆలోచనాతీరును ప్రశంసిస్తున్నారు.