నాకు క్యాన్సర్ సోకింది: సోనాలి బింద్రే
ప్రముఖ సినీ నటి సోనాలి బింద్రే.. తనకు క్యాన్సర్ సోకినట్టు కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ ద్వారా తెలిపింది.
ప్రముఖ సినీనటి సోనాలి బింద్రే.. తనకు క్యాన్సర్ సోకినట్టు కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించిన సోనాలి.. ఈ సమయంలో ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారంది. వ్యాధికి న్యూయార్క్లో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. వైద్యులు సలహా, సూచనల మేరకే ప్రస్తుతం న్యూయార్క్లో చికిత్స పొందుతున్నానన్నారు. కుటుంబం, స్నేహితుల బలం తీసుకొని యుద్ధంలా క్యాన్సర్తో పోరాడుతానన్నారు సోనాలి.
సోనాలి క్యాన్సర్తో బాధపడుతున్నారనే విషయం తెలుసుకున్న అభిమానులు షాక్కు గురయ్యారు. ఆమె క్యాన్సర్ నుండి త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.1994లో తొలిసారి గోవిందా సరసన ఆగ్ అనే చిత్రంలో నటించింది సోనాలి. ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించిన సోనాలి మరాఠీతో పాటు, దక్షిణ భారతదేశంలో తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటించారు. తెలుగులో సోనాలి బింద్రే మురారి, ఖడ్గం, ఇంద్ర, పల్నాటి బ్రహ్మనాయుడు, మన్మధుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి చిత్రాలలోను నటించారు. ప్రస్తుతం బుల్లితెరపైన పలు రియాలిటీ షోలు కూడా చేస్తున్నారు.