Fear Movie Pooja Ceremony: సస్పెన్స్, థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో హీరోయిన్ వేదిక ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ఫియర్. ఈ సినిమా షూటింగ్ నేడు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో మొదలైంది. దత్తాత్రేయ మీడియా బ్యానర్‌పై ఏఆర్ అభి నిర్మిస్తుండగా.. హరిత గోగినేని దర్శకత్వం వహిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్‌లో యాక్ట్ చేస్తున్నారు. బుధవారం జరిగిన పూజా కార్యక్రమంలో సీనియర్ నటులు మురళీ మోహన్ పాల్గొన్నారు. స్క్రిప్ట్ అందించగా.. డైరెక్టర్ కరుణాకరన్ క్లాప్ కొట్టారు. డైరెక్టర్ తేజ కాకుమాను, హీరో సోహైల్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా హీరోయిన్ వేదిక మాట్లాడుతూ ఫియర్ మూవీ షూటింగ్ కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నానని చెప్పారు. సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటాయని.. తన క్యారెక్టర్ మల్టీ డైమెన్షన్స్‌తో ఉంటుందన్నారు. తాను తెలుగులో కాంచన, రూలర్ సినిమాల్లో యాక్ట్ చేశానని.. ఓ వెబ్ సిరీస్ చేశానన్నారు. కానీ సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీలో నటించలేదని.. దర్శకురాలు హరిత గోగినేని ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లర్ స్క్రిప్ట్ రెడీ చేశారని చెప్పుకొచ్చారు. 


దర్శకత్వం వహించడం అనేది తన డ్రీమ్ కాదు.. డెస్టినీ అనుకుంటానని దర్శకురాలు హరిత గోగినేని అన్నారు. దత్తాత్రేయ మీడియా తన ఫ్యామిలీ బ్యానర్ లాంటిదని.. తమ ఫియర్ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభోత్సవం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆడియన్స్‌కు ఎలాంటి మూవీ నచ్చుతుందనే ఆలోచనతో ఈ చిత్రానికి స్క్రిప్ట్ రెడీ చేశానని చెప్పారు. ఈ కథకు సరిపోయే హీరోయిన్ దొరకడం హ్యాపీగా ఉందన్నారు.


దర్శకురాలు హరిత చేసే ప్రతి పనిలో డెడికేటెడ్‌గా ఉంటుందన్నారు నిర్మాత ఏఆర్ అభి. ఫియర్ స్క్రిప్ట్‌ను చాలా బాగా రాసుకున్నారని.. హరిత ఛాలెంజింగ్‌ క్యారెక్టర్‌లో కనిపించబోతుందన్నారు. అరవింద్ కృష్ణ స్పెషల్ రోల్ చేస్తున్నాడని.. తను హీరో అయినా.. తాము ఈ స్క్రిప్ట్ చెప్పగానే ఓకే అని చేసేందుకు ముందుకొచ్చాడని మెచ్చుకున్నారు. ఈ మూవీలో తాను ఒక స్పెషల్ రోల్‌లో నటిస్తున్నానని హీరో అరవింద్ కృష్ణ తెలిపారు. ఈ మూవీలో భాగమవ్వడం హ్యాపీగా ఉందన్నారు. 


జేపీ (జయప్రకాష్), పవిత్ర లోకేష్, అనీష్ కురువిల్ల, షియాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా ఐ ఆండ్రూ పనిచేస్తున్నారు. కో ప్రొడ్యూసర్‌గా సుజాత రెడ్డి వ్యవహరిస్తున్నారు. 


Also Read: Realme 12 Pro: శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Realme 12 Pro మొబైల్‌..దీని కెమెరాపై ఏ యాపిల్‌ ఫోన్ కెమెరా పనికి రాదు!


Also Read: Chandrababu Case: క్వాష్ కొట్టివేత, ద్విసభ్య ధర్మాసనంలో ఎవరేమన్నారంటే


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter