బాయ్ ఫ్రెండ్ ను వదిలించుకోవడం ఎలా.. ?
ఒంటరి జీవితమే ప్రశాంతం. .
బాయ్ ఫ్రెండ్ తో దాగుడు మూతలు ఆడాలి.. 

బాలీవుడ్ బ్యూటీ అదా శర్మ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.  తెలుగులో హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అదా శర్మ .. సోషల్ మీడియాతో ఫ్యాన్స్ ను బాగా అలరిస్తోంది.  ఆమె వాలెంటైన్ డే సందర్భంగా చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లవర్స్ డే సందర్భంగా .. చాలా మంది అమ్మాయిలు .. ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయడంలో ..లేదా బాయ్ ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేయడంలో బిజీగా ఉంటారు. కానీ టాలీవుడ్ బ్యూటీ .. అదా శర్మ కాస్త డిఫరెంట్ గా ప్రయత్నించింది. లవర్స్ డే పై ... బాయ్ ఫ్రెండ్ ను వదిలించుకోవడం ఎలా అంటూ  ఓ వీడియో చేసింది. దీన్ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.  ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఓ ఊయలలో ఊగుతూ .. లవర్స్ కు ట్యూషన్ పాఠాలు చెబుతోంది ఈ అమ్మడు. మీరూ ఓ లుక్కేయండి.



Read Also:నేనూ ఎక్కేయగలనంటున్న బాలీవుడ్ బ్యూటీ


బాయ్ ఫ్రెండ్‌తో దాగుడు మూతలు ఆడాలని .. అదా శర్మ చెబుతోంది. కనీసం అతనికి 2 కిలోమీటర్ల దూరం ఉండాలని అంటోంది. దీని వల్ల ఒంటరి జీవితం ప్రశాంతంగా ఉంటుందని వైరాగ్యం ఒలకబోసింది. ఐతే  బాయ్ ఫ్రెండ్‌తో దాగుడు మూతలు ఆడితే ప్రేమ మరింత పెరుగుతుందన్నది అమ్మడి ప్రేమ సందేశంగా తెలుస్తోంది.  


ప్రస్తుతం ఈ కుందనపు బొమ్మ హిందీ చిత్రాలతో బిజీగా ఉంది.  ఇటీవలే  'కమాండో 3' సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.