Adipurush Tickets @ Rs 112: ఆదిపురుష్ సినిమా నిర్మాతల కీలక నిర్ణయం.. టికెట్ల రేటు మరింత తగ్గింపు.. కేవలం రూ. 112 కే 3D టికెట్టు
Adipurush Tickets @ Rs 112: ఆదిపురుష్ మేనియా ముగిసింది. సినిమా సత్తా ఏంటో తెలిసిపోయింది. కలెక్షన్లు తగ్గిపోవడంతో చిత్ర నిర్మాతలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రేపట్నించి టికెట్ ధరల్ని తగ్గిస్తున్నామని టీ సిరీస్ సంస్థ ప్రకటించింది.
Adipurush Tickets @ Rs 112: ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమై జూన్ 16న విడుదలైన ఆదిపురుష్ సినిమా ఆశించిన అంచనాలను అందుకోలేకపోయింది. సినిమా ల్యాగ్ ఉండటమే కాకుండా విమర్శలు రేగడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది. రోజురోజుకూ కలెక్షన్లు పడిపోతుండటంతో చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆదిపురుష్ సినిమా మొదటి మూడ్రోజులు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రభావంతో 250 కోట్ల వరకూ బిజినెస్ చేసి రికార్డు సృష్టించింది. ఇవే కలెక్షన్లు కొనసాగుతాయని అంతా ఆశించారు. అయితే విడుదలైన నాలుగవరోజు నుంచి రోజురోజుకూ కలెక్షన్లు పడిపోతూ వచ్చాయి. ఎంతలా ఉంటే ఇప్పటి వరకూ ఈ సినిమా కేవలం 363 కోట్లే గ్రాస్ కలెక్షన్లు చేయగలిగింది.
ఆదిపురుష్ బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. సినిమా విడుదలైన నాలుగోరోజు నుంచే కలెక్షన్లు గణనీయంగా తగ్గిపోయాయి. నాలుగవ రోజు నుంచి రోజు రోజుకూ కలెక్షన్లు తగ్గుతూ వచ్చాయి. మొదటి రోజు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 32 కోట్ల షేర్ కలెక్షన్లు వసూలు చేసిన సినిమా 7వ రోజుకు 97 లక్షల షేర్ మాత్రమే సాధించింది. ఇక 8వ రోజుకు మరింతగా పడిపోయింది. కేవలం 65 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 363 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసింది.
దాంతో ఆదిపురుష్ సినిమా టికెట్లను తగ్గిస్తూ చిత్ర నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. రేపట్నించి 3డిలో సినిమాను కేవలం 112 రూపాయలకే చూడవచ్చని టీ సిరీస్ ప్రకటించింది. సినిమాలోని డైలాగ్స్‌పై అభ్యంతరాలు రావడంతో వాటిని కూడా మార్చినట్టు టీ సిరీస్ వెల్లడించింది. మార్పులు చేర్పులు చేసిన సినిమా రేపట్నించి ప్రదర్శితం కానుంది. ప్రభాస్ రాముడి పాత్రలో, కృతి సనన్ సీత పాత్రలో నటించగా రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. కాగా ప్రభాస్ కెరీర్‌లో రాధేశ్యామ్ తరువాత ఇది రెండవ డిజాస్టర్ కావడంతో ప్రభాస్ అభిమానులు నిరాశలో ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్ కానీ , అతని అభిమానులు కానీ త్వరలో విడుదల కానున్న సలార్‌పైనే ఆశలు పెట్టుకున్నారు.
Also Read: Shriya Saran: అందాల బాంబ్ పేల్చిన శ్రియా.. ఉర్పీ జావేద్ కాపీ అంటూ ట్రోలింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook