Kamal Haasan in Project-K: ప్రభాస్ సినిమాలో 'కమల్ హాసన్'.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం!

Kamal Haasan in Project-K: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రాజెక్టు-కే. ఈ చిత్రంలో మరో బడా హీరో భాగమైనట్లు తెలుస్తోంది. ఆయనే తమిళ స్టార్ హీరో కమల్ హాసన్. త్వరలో షూటింగ్ లో కూడా పాల్గొనున్నట్లు సమాచారం.

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 27, 2023, 11:24 AM IST
Kamal Haasan in Project-K: ప్రభాస్ సినిమాలో 'కమల్ హాసన్'.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం!

Kamal Haasan is Going to Join in Project - K Shooting: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'ప్రాజెక్టు-కే'(Project-K Movie). ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వినీదత్ సుమారు రూ.500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్లు అమితాబ్‍ బచ్చన్, దీపికా పదుకొణ్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అమితాబ్ హైదరాబాద్ వచ్చి షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. ఈ సినిమాకు సంతోషన్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. 

తాజాగా ఈ బిగ్ ప్రాజెక్టులో మరో బడా స్టార్ కూడా నటించనున్నారని తెలుస్తోంది. ఆయనే మన లోకనాయకుడు కమల్ హాసన్. ఈయన తన పాత్ర కోసం త్వరలోనే చిత్రబృందంతో కలవనున్నట్లు సమాచారం. అంతేకాకుండా నాలుగు వారాలపాటు షూటింగ్ లో కూడా పాల్గొంటారని తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో కమల్ హాసన్ ఎటువంటి పాత్రలో నటించనున్నారో అనేది తెలియాల్సి ఉంది. 

అయితే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ టైటిల్‍, మోషన్ పోస్టర్‌ను జూలై రెండవ లేదా మూడవ వారంలో రిలీజ్ చేయాలని చిత్ర బంంద ప్లాన్ చేస్తుంది. దీని లాంచ్ ఈవెంట్ అమెరికాలో గ్రాండ్ గా జరపనున్నారని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా బజ్ క్రియేట్ చేయడానికి మేకర్స్ ఇలా చేస్తున్నట్లుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 

Also Read: Adipurush Total Collections: వెనుకబడిన ఆదిపురుష్ మూవీ కలెక్షన్స్

సెప్టెంబర్ 28నే సలార్!
మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ మూవీ షూటింగ్ దాదాపు కంప్లీట్ అయింది. మూవీ టీజర్‌ను జూలై మొదటి వారంలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తుంది. ఈ సినిమాలో శ్రుతిహాసన్, జగపతి బాబు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. హోంబల్ ప్రిలిమ్స్ పతాకంపై విజయ కిరాగుందర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

Also Read: Rakul Preet Singh Pics: రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ షో.. కుర్రకారుకు నిద్ర పట్టేనా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x