కాసుల వర్షం కురిపించిన ఐ ఫోన్ ఎక్స్
ఐఫోన్ ఎక్స్ మార్కెట్ లో భారీ స్థాయిలో అమ్ముడుపోతున్నాయి. గత మోడల్ ఐఫోన్ 8 తో పోల్చితే యాపిల్ సంస్థ దాదాపు 43 శాతం అధిక లాభాలను ఆర్జించింది. ఆపిల్ లాభాలను అంచనా వేసిన టెక్ఇన్‌సైట్స్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఫోన్ తయారీకి అయిన ఖర్చు రూ. 23,200 చేయగా..ఫోన్ అమ్మకపు ధర రూ. 64,800 పలుకుతోంది. అంటే ఒక్కో ఫోన్ మీద దాదాపు 64 శాతం మార్జిన్ లాభంగా పొందిందన్న మాట.
అయితే టెక్ఇన్‌సైట్స్ కథనాలపై స్పందించేందుకు ఆపిల్ సంస్థ నిరాకరించింది. అయితే తమ అంచనాలకు మద్దతుగా ఐఫోన్ ఎక్స్‌లో ఉపయోగించిన విడిభాగాల ధరలను కూడా టెక్ఇన్‌సైట్స్ వెల్లడించింది. ఐఫోన్ ఎక్స్‌లో వాడిన 5.8 ఇంచుల డిస్‌ప్లేకి రూ. 4 వేల 300 , బాడీ తయారీకి ఉపయోగించిన స్టెయిన్‌లెస్ స్టీల్‌కి రూ. 2 వేల300 అయి ఉంటుందని టెక్ఇన్‌సైట్స్ తెలిపింది.