దేశం కష్టకాలంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్పై (COVID-19) కేంద్రం చేస్తోన్న పోరాటానికి మద్దతుగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) భారీ విరాళం ప్రకటించి తాను రీల్ హీరోను మాత్రమే కాదు... రియల్ హీరోను కూడా అని అనిపించుకున్నాడు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సాయం అందించే సహాయ నిధి పీఎం కేర్స్ ఫండ్‌కి (PM-CARES fund) అక్షయ్ కుమార్ ఒకటి కాదు.. రెండు కాదు..  ఏకంగా రూ. 25 కోట్ల భారీ విరాళం అందించనున్నట్టు ప్రకటించి అవసరంలో ఉన్న వారికి తానున్నానని తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. ఈ ఆపత్కాలంలో మానవాళిని రక్షించుకోవాల్సిన సమయం ఇదేనని.. అందుకోసం మనకు తోచిన సాయాన్ని మనం చేద్దామని అక్షయ్ కుమార్ పిలుపునిచ్చాడు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్షయ్ కుమార్ చేసిన ఈ సాయం బాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్ హీరోలకు ఆదర్శంగా నిలిచింది. అంతకంటే ముందుగా ప్రముఖ కమెడియన్, బుల్లితెర వ్యాఖ్యాత కపిల్ శర్మ (Kapil Sharma donates) సైతం ప్రధాని రిలీఫ్ ఫండ్‌కి రూ. 50 లక్షలు విరాళం ప్రకటించి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ఈ కష్టకాలంలో మన అవసరం ఉన్న వారికి మనం తోడుగా నిలవాల్సిన అవసరం ఉందని కపిల్ శర్మ ట్వీట్ చేశాడు.



జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..