Godfather Vs Kantara : మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాకు కొన్ని అంశాలు కలిసి వచ్చాయి. లాంగ్ వీకెండ్ దొరకడం, దసరా సెలవులు, సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు బాగానే వచ్చాయి. అయితే మేకర్లు ప్రకటించుకున్నంత అయితే రావడం లేదని తెలుస్తోంది. మేకర్లు రిలీజ్ చేసే పోస్టర్లకు, ట్రేడ్ సర్కిల్లలో వినిపిస్తోన్నలెక్కల్లో చాలా తేడా ఉందని తెలుస్తోంది. ఎలాగోలా మొదటి వారం బాగానే ఆడింది. ఇక రెండో వారంలోనూ పెద్ద సినిమాలేవీ లేవు. మళ్లీ రెండో వారంలోనూ గాడ్ ఫాదర్ హవానే ఉంటుందని అంతా భావించారు. కానీ అల్లు అరవింద్ అన్నీ లెక్కల్ని మార్చేశాడు. కాంతారా సినిమాను విడుదల చేసి గాడ్ ఫాదర్ సినిమాను పరోక్షంగా దెబ్బకొట్టేసినట్టు అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గాడ్ ఫాదర్ సినిమాను రెండో వారానికి వచ్చే సరికి మూడొందల థియేటర్లకు మాత్రమే పరిమితం చేశారు. అది మొదటి వారంలో అయితే 715 థియేటర్లున్నాయి. అంటే సగానికి పైగా తగ్గించేశారు. ఇదిలా ఉంటే.. అల్లు అరవింద్ తాను కొన్న డబ్బింగ్ సినిమాను భారీ స్థాయిలోనే రిలీజ్ చేశాడు. దగ్గరదగ్గరగా మూడొందల థియేటర్లో రిలీజ్ చేశాడు. అంటే ఇప్పుడు గాడ్ ఫాదర్ ఎన్ని థియేటర్లో ఉందో.. కాంతారా కూడా అన్ని థియేటర్లో ఉంది. అసలే గాడ్ ఫాదర్ సినిమాకు కలెక్షన్ల ప్రచారం ఎక్కువ.. వాస్తవం తక్కువ అనేట్టుగా ఉంది.


ఈ వారంలో కూడా పెద్ద సినిమాలేవీ లేవు కదా?.. గాడ్ ఫాదర్‌కు ఈ రెండో వారం కూడా కలిసి వస్తుందని అంతా భావించారు. కానీ మధ్యలో అల్లు అరవింద్ దూరి దెబ్బ కొట్టేశాడు. అది మామూలు దెబ్బ కాదు. ఇప్పుడు గాడ్ ఫాదర్ గురించిఎవ్వరూ మాట్లాడుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. కాంతారా దెబ్బతో గాడ్ ఫాదర్ ఎగిరి అవతల పడేట్టుంది. మొత్తానికి ఇప్పుడు గాడ్ ఫాదర్  పని అయినట్టు కనిపిస్తోంది. కాంతారా సినిమాకు రోజురోజుకూ కలెక్షన్లు పెరిగే చాన్స్ కనిపిస్తోంది.


అలా అల్లు అరవింద్ కాంతారా సినిమాతో చిరంజీవిని, చిరు సినిమా గాడ్ ఫాదర్‌ను దెబ్బ కొట్టేసినట్టు అయింది. అల్లు అరవింద్ చేతిలో ఎన్ని థియేటర్లున్నాయో.. అన్నింట్లోనూ కాంతారా సినిమాను వేసినట్టు తెలుస్తోంది. ఇక టాక్ బాగా ఉండటంతో అవి మరింత పెరిగే చాన్స్ఉంది. లాంగ్ రన్‌లో గాడ్  ఫాదర్ కలెక్షన్లను కాంతారా బీట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదేమో.


Also Read : Kantara Movie Collections : కాంతారాకు పెట్టింది ఎంత?.. వచ్చింది ఎంత?


Also Read : Katragadda Murari Death : టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూత


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook