అల్లు అర్జున్ తర్వాతి సినిమాలో రామ్ చరణ్ హీరోయిన్ ?
అల్లు అర్జున్ తర్వాతి సినిమాకు రామ్ చరణ్ హీరోయిన్ ఎంపిక ?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా డిసెంబర్ సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే, ఈ సినిమాలో బన్నీకి తగిన జోడి కోసం అన్వేషిస్తున్న త్రివిక్రమ్... ఆఖరిగా ఓ బాలీవుడ్ నటిపై దృష్టిసారించినట్టు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు.. భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు సరసన నటించి ఆ తర్వాత ప్రస్తుతం రామ్ చరణ్‌తో బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న హీరోయిన్ కియారా అద్వానినే. అవును, త్రివిక్రమ్ టీమ్ ప్రస్తుతం కియారా అద్వానితో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.
ఒకవేళ కియారా డేట్స్ కానీ అడ్జస్ట్ అయ్యాయంటే, రామ్ చరణ్‌తో సినిమా పూర్తి కాగానే కియారా కాస్తా నేరుగా త్రివిక్రమ్-అల్లు అర్జున్ సినిమా సెట్స్‌లో వాలిపోవడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. అయితే, ఇప్పటివరకు దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.