AP TET 2024 Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌ ద్వారా నేరుగా చెక్‌ చేసుకోండి..

AP TET 2024 Results out: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్న టెట్‌ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. ఈరోజు జూన్‌ 25న టెట్‌ ఫలితాలు 2024 విడుదల చేసింది. ఈ పరీక్ష హాజరైన విద్యార్థులు నేరుగా లింక్‌ ద్వారా తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

Written by - Renuka Godugu | Last Updated : Jun 25, 2024, 04:12 PM IST
AP TET 2024 Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌ ద్వారా నేరుగా చెక్‌ చేసుకోండి..

AP TET 2024 Results out: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్న టెట్‌ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. ఈరోజు జూన్‌ 25న టెట్‌ ఫలితాలు 2024 విడుదల చేసింది. ఈ పరీక్ష హాజరైన విద్యార్థులు నేరుగా లింక్‌ ద్వారా తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. 

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2,67,789 అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా అందులో 2,35, 907 మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. ఫిబ్రవరి 7న నోటిఫికేషన్‌ అప్పటి ప్రభుత్వం విడుదల చేయగా.. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు ఏపీ టెట్ కి సంబంధించిన పరీక్షలను నిర్వహించింది దీనికి అప్పట్లో కీ ని కూడా రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన ఫలితాలను ఏపీ ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది అభ్యర్థులు ఏపీ టెట్ రిజల్ట్స్ తెలుసుకోవడానికి డైరెక్ట్ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా  https://aptet.apcfss.in/ 
ద్వారా నేరుగా రిజల్ట్స్ ని తెలుసుకోవచ్చు. ఈ ఫలితాలు మార్చి 14న విడుదల కానుండగా లోక్‌ సభ ఎన్నికల నేపథ్యంలో కోడ్‌ ఉండటంతో ఈ పరీక్ష ఫలితాలను వాయిదా వేశారు. 

అర్హత..
ఇంటర్మీడియట్ లేదా తత్సమానం పూర్తి చేసి అందులో 50% మార్కులు పొందిన వారు నాలుగు సంవత్సరాలుగా బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పూర్తి చేసిన వారు అర్హులు.
అప్పర్ ప్రైమరీ స్టేజ్ బిఎస్సి, బిఏ, బీకాం, బ్యాచిలర్ డిగ్రీ లో కనీసం 45 శాతం మార్కులు వచ్చి ఒక సంవత్సరం పాటు బీఈడీ డిగ్రీ చేసిన వారు అర్హులు. ఇక టెట్‌ లో అర్హత సాధించిన వారికి డీఎస్సీలో కూడా 20 శాతం వరకు వెయిటేజీ లభిస్తుంది.

ఇదీ చదవండి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వాడేసుకుంటున్న కమెడియన్ హైపర్ ఆది

రిజల్ట్స్ చెక్ చేసుకునే విధానం..
ముందుగా అధికారిక వెబ్సైట్ www.ataptet. Apcfss. In ఓపెన్ చేసి అందులో హోమ్ పేజీలో 'క్లిక్ హియర్ ఫర్ రిజల్ట్స్' అనే ఆప్షన్ ని ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ ఐడి పుట్టిన సంవత్సరం వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి. అప్పుడు లాగిన్ చేస్తే మీ ఫలితాలు కనిపిస్తాయి. ఆ ప్రింట్‌ తీసి పెట్టుకోవాలి.

ఇదీ చదవండి: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. రూ. 300 ల దర్శన టికెట్లు విడుదల.. ఆ రోజే ఆర్జిత సేవా టికెట్లు..

స్కూల్లో టీచర్ వృత్తిలో రాణించాలనుకునేవారు టెట్ పరీక్షలు రాస్తారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతుంది ముఖ్యంగా రూరల్ అర్బన్, ఏపీ మోడల్ స్కూల్స్, వెల్ఫేర్ అండ్ సొసైటీ స్కూల్స్లో టీచర్ జాబ్స్ పొందడానికి ఈ పరీక్షను నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఈ ఎగ్జామినేషన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 2024 ఫిబ్రవరి 26 నుంచి మార్చి 9 వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు. మార్చి 14న ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కోడ్‌ అమలులో ఉన్నందున ఫలితాలను రిలీజ్ చేయడంలో ఆలస్యమైంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News