ఈ చిత్రంలో ఎన్ని పులులున్నాయో లెక్కించగలరా అంటూ అమితాబ్ బచ్చన్ ను చమత్కరించిన ఓ ట్విట్టర్ యూజర్..
ట్విట్టర్లో ఇప్పుడు కొత్త రకమైన ఆట ప్రతి ఒక్కరిని ఆశ్చ్యర్యపరుస్తోంది. ప్రత్యేకంగా జంతు ప్రేమికుల దృష్టిని మరింత ఆకర్షిస్తోంది.అయితే ఓ ట్విట్టర్ యూజర్ పులులన్న చిత్రాన్ని ట్వీట్ చేశాడు. ఆయన ట్విట్టర్లో పేర్కొంటూ
ముంబై: ట్విట్టర్‌లో ఇప్పుడు కొత్త రకమైన ఆట ప్రతి ఒక్కరిని ఆశ్చ్యర్యపరుస్తోంది. ప్రత్యేకంగా జంతు ప్రేమికుల దృష్టిని మరింత ఆకర్షిస్తోంది.అయితే ఓ ట్విట్టర్ యూజర్ పులులన్న చిత్రాన్ని ట్వీట్ చేశాడు. ఆయన ట్విట్టర్లో పేర్కొంటూ ఈ ఫొటోలో ఉన్న పెద్ద పులుల సంఖ్యను లెక్కించమని నెటిజన్లను కోరాడు. అయితే ఈ చిత్రంలో మీరు ఎన్ని పులుఉన్నాయో చెప్పగలరా? అంటూ తన బ్లాగ్ లో పంచుకున్నాడు.
సాధారణంగా ఈ చిత్రంలో కేవలం నాలుగు పులులు ఉన్నట్లు కనిపిస్తాయని, రెండు పెద్ద పులులు, రెండు చిన్న పులులుంటాయని పేర్కొంటూ.. ఆసక్తికరమైన అంశమేమిటంటే కొంచెం దగ్గరగా చూడండి. మిమ్మల్ని తెలివిగా మభ్యపెట్టే విధంగా ఎక్కువ పులులు ఉన్నాయని వాటిని మీరు గమనించినట్లయితే వాటిని చూడగలరంటూ చమత్కరించారు. ఇదిలాఉండగా అమితాబ్ బచ్చన్ ట్వీట్ లో పేర్కొంటూ పులుల సంఖ్యను లెక్కించి తన సమాధానాన్నిట్వీట్ ద్వారా పంచుకుంటూ ఇందులో 11 పులులున్నాయని, బాలీవడ్ బామ దియా మీర్జా తన ట్విట్టర్లో పేర్కొంటూ ఈ చిత్రంలో 16 పులులున్నాయని పేర్కొంది. మరో యూజర్ 18 పులులున్నాయని ట్వీట్ చేసారు.
మరోవైపు ఈ పులుల చిత్రం ట్విట్టర్‌లో 3,500 మందికి పైగా 'లైక్'లతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో 3,000 కి పైగా స్పందనలను రాగా అందులో ప్రత్యేకమైనది అమితాబ్ బచ్చన్ ట్వీట్. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..