Amitabh Bachchan hospitalized: ముంబై: అమితాబ్ బచ్చన్‌​కు కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కుటుంబసభ్యులు అమితాబ్‌ని ముంబైలోని నానావతి ఆసుపత్రిలో ( Nanavati hospital ) చేర్పించారు. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. కుటుంబసభ్యులు, ఇంట్లో పని చేసే సిబ్బందికి కరోనా పరీక్షలు పూర్తయ్యాయని.. పరీక్షల రిపోర్టుల కోసం వేచిచూస్తున్నామని బిగ్ బి తెలిపారు. గత 10 రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న వాళ్లంతా కరోనా పరీక్షలు ( COVID-19 tests ) చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్టు అమితాబ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమితాబ్ బచ్చన్ లేటెస్ట్ మూవీస్ విషయానికొస్తే.. ఇటీవలే బిగ్ బీ గులాబో సీతాబో అనే సినిమాలో నటించారు. ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ ఆద్యంతం హాస్యాన్ని పండించే ఓ వృద్ధుడి పాత్రలో కనిపించారు. కరోనావైరస్ కారణంగా సినిమాలు థియేటర్లో విడుదలయ్యే అవకాశం లేకపోవడంతో గులాబో సితాబో చిత్ర నిర్మాతలు ఆ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు. చెహ్రే, బ్రహ్మస్త్ర చిత్రాల్లోనూ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషించారు.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయాన్ని తెలుసుకున్న ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయన ఆరోగ్యంగా ఇంటికి తిరిగ రావాలని కోరుకుంటూ ట్విటర్ ద్వారా స్పందిస్తున్నారు. ముందుగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. అమితాబ్ త్వరలోనే కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

అనంతరం అనేక మంది బాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ, వ్యాపార ప్రముఖులు అమితాబ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్స్ చేశారు. నటుడు మనోజ్ బాజ్‌పేయ్ ట్వీట్

అనుపమ్ ఖేర్ ట్వీట్

బీజేపి ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా ట్వీట్