Anasuya Bharadwaj on Liger: అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు.. కర్మ తప్పదంటూ దేవరకొండను టార్గెట్ చేసిన అనసూయ!
Anasuya Bharadwaj on Liger: లైగర్ మూవీ గురించి అనసూయ భరద్వాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే
Anasuya Bharadwaj Tweet Goes Viral fans says she targets Vijay Devarakonda's Liger Movie: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే యాంకర్ అనసూయ భరద్వాజ్ చేసిన తాజా ట్వీట్ కలకలం రేపుతోంది. ‘’అమ్మని అన్న ఉసురు ఊరికే పోదని పేర్కొన్న ఆమె కర్మ కచ్చితంగా వెంటాడి తీరుతుందని పేర్కొంటూ ఒక ట్వీట్ చేసింది. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు ఏమో కానీ రావడం మాత్రం పక్కా అంటూ కర్మ గురించి ఆమె ట్వీట్ చేసింది. ఎవరో బాధపడుతున్నారని నేను ఆనంద పడడం లేదు కానీ కర్మ రావడం పక్కా అనే విషయం మీద తనకు నమ్మకం ఏర్పడింది అంటూ అనసూయ ట్వీట్ చేశారు.
అయితే అది విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టైగర్ సినిమాకి నెగిటివ్ టాక్ రావడం గురించి ఆమె పరోక్షంగా ప్రస్తావిస్తూ ట్వీట్ చేసి ఉండవచ్చు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిజానికి విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమా సమయంలో విజయ్ దేవరకొండ - అనసూయ భరద్వాజ్ మధ్య సోషల్ మీడియాలో ఒక పెద్ద యుద్ధమే జరిగింది. సినిమా ప్రమోషనల్ స్టైల్ నచ్చకపోవడంతో అప్పట్లో అనసూయ భరద్వాజ్ విజయ్ దేవరకొండను, సినిమాలో అసభ్యతను టార్గెట్ చేసి పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ కూడా ప్రత్యక్షంగా ఎలాంటి కామెంట్స్ చేయకపోయినా పరోక్షంగా ఆమెకు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు.
అప్పట్లో ఈ వివాదం చాలా దూరం వెళ్ళింది. అయితే తర్వాత అనసూయ భరద్వాజ్ విజయ్ దేవరకొండ నిర్మాతగా వ్యవహరించిన ఒక సినిమాలో ఒక కీలక పాత్రలో కూడా నటించింది. తరుణ్ భాస్కర్ హీరోగా విజయ్ దేవరకొండ నిర్మాతగా వ్యవహరించిన మీకు మాత్రమే చెప్తా అనే సినిమాలో అనసూయ కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటించింది. దీంతో విజయ్ దేవరకొండ అనసూయ భరద్వాజ్ మధ్య గొడవలు సమసి పోయాయని అందరూ అనుకున్నారు.
కానీ విజయ్ దేవరకొండ లైగర్ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చిన వెంటనే అనసూయ కర్మ అంటూ ట్వీట్ చేయడం అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంలో అనసూయ భరద్వాజ మీద ట్రోలింగ్ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఆమె ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ఆర్టికల్ లో రాయలేని విధంగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఆమె చేసిన ట్వీట్ కింద ఆ ట్వీట్ కి వచ్చిన కామెంట్లు చూస్తే ఆ విషయం మీకే అర్థమవుతుంది. ఒక లుక్ వేసేయండి మరి.
Also Read: Heros Rejected Liger: ప్రభాస్, ఎన్టీఆర్ సహా లైగర్ ను రిజెక్ట్ చేసిన హీరోలు ఎవరంటే?
Also Read: Warangal Srinu Liger Movie: మరోసారి పప్పులో కాలేసిన వరంగల్ శ్రీను.. 'లైగర్'తో మళ్లీ నష్టాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి