తెలుగు సినీవర్గాల్లో కలకలం సృష్టించిన షికాగో సెక్స్ రాకెట్‌పై నటి శ్రీరెడ్డి, సంజన, యాంకర్ కమ్ నటి అనసూయ స్పందించారు. అమెరికాలో ఉన్న ఆ మేనేజర్స్ దంపతులు గతంలో తమను కూడా సంప్రదించారని శ్రీరెడ్డి, సంజన, అనసూయ ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌పై పోరాటం చేస్తూ, పలువురు సినీ ప్రముఖులపై చేసిన ఆరోపణలతో హెడ్‌లైన్స్‌లోకి ఎక్కిన నటి శ్రీరైడ్డి ఈ వివాదంపై స్పందిస్తూ "ఆ అమెరికా దంపతులు తనను కూడా సం‍ప్రందించారు" అని అన్నారు. ‘అవకాశాల్లేని హీరోయిన్లకు అమెరికాలో ఈవెంట్స్‌, ప్రోగ్రామ్స్ పేరిట ఎర వేసి అక్కడకు రప్పించి.. అక్కడే వారిని మభ్యపెట్టి వ్యభిచారంలోకి దింపుతున్నారని శ్రీ రెడ్డి ఆరోపించారు. అలా వెళ్లిన ఆర్టిస్టులకు వాళ్ల వాళ్ల స్థాయిని, వారికి ఉన్న పాపులారిటీనిబట్టి సుమారు 1000 అమెరికా డాలర్ల నుంచి 10,000 డాలర్ల వరకు ఆఫర్‌ చేస్తున్నారని స్పష్టంచేశారామె.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వివాదంపై యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ స్పందిస్తూ.. తాను చాలా రోజులుగా అమెరికాకే వెళ్లలేదని అన్నారు. '' 2014లో మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీప్రసాద్‌తో ఓ ఈవెంట్‌కు హాజరయ్యాను. 2016లో అమెరికా నెంబర్‌తో శ్రీరాజ్‌ అనే వ్యక్తి నన్ను సంప్రదించాడు. తెలుగు అసోసియేషన్‌ నిర్వహించే ఓ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా కోరాడు. అయితే, అతడు మాట్లాడే విధానం సరిగ్గా లేదనిపించి తాను అతడి ఆహ్వానానికి ఓకే చెప్పలేకపోయాను. అయినప్పటికీ ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌లో అనసూయ హాజరవుతున్నారు అంటూ నా ఫొటోను ప్రచురించారు. అది గమనించి నేను ఆ ఈవెంట్‌లో పాల్గొనడం లేదని వెంటనే ట్విటర్‌ ద్వారా స్పష్టం చేశాను'' అని అప్పట్లో తనకు ఎదురైన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారామె.


బుజ్జిగాడు సినిమాలో నటి త్రిషకు సోదరిగా పరిచయమై ఆ తర్వాత తెలుగు, కన్నడం, మళయాళం భాషల్లో అడపాదడపా సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంటున్న సంజన ఈ సెక్స్ రాకెట్ వ్యవహారంపై స్పందిస్తూ.. ''అమెరికాలో జరిగే క్రాస్ కల్చరల్ ఈవెంట్స్‌లో కొంతమంది నటీమణులని చూపించి, విటులని ఆకర్షించి వ్యాపారం చేసుకోవడం ఇవాళ కొత్తగా జరుగుతున్నదేం కాదు.. అది ఎప్పటినుంచో జరుగుతున్న తంతే '' అని అన్నారామె. సాధారణంగా సీ, డీ గ్రేడ్‌కి సంబంధించిన నటీమణులే అటువంటి ఏజెంట్ల వలకు చిక్కుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఎక్కువ డబ్బులు ఇచ్చి డ్యాన్స్ పర్‌ఫార్మెన్స్‌లు సైతం చేయించుకుంటుంటారు. ఇంకొన్ని సందర్భాల్లో పరస్పర అవగాహన ఒప్పందంతోనే ఈ ఊబిలో చిక్కుకుంటున్న వాళ్లు కూడా లేకపోలేదు అని సంజన సంచలన వ్యాఖ్యలు చేశారు.