ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి ( Sushant Singh Rajput ) మర్చిపోకముందే నిన్న హిందీ టీవీ నటుడు సమీర్ శర్మ ( Sameer Sharma's death ) తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకోవడం ముంబైలో కలకలం రేపింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్, సమీర్ శర్మ మృతిపై పోలీసులు దర్యాప్తు జరుపుతుండగానే తాజాగా ముంబైలోనే భోజ్‌పురి టీవీ నటి అనుపమ పాఠక్ ( TV Actress Anupama Pathak suicide ) ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన విష‌యం ఆల‌స్యంగా వెలుగుచూసింది. ముంబైలోని తన అపార్టుమెంట్ గదిలో అనుపమ పాఠక్ ఉరేసుకుని ఆత్మ‌హ‌త్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనుప‌మ పాఠ‌క్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడుతూ.. జీవితంలో ఎవ్వరినీ నమ్మరాదని.. ఒకవేళ నమ్మితే, వారు మన నిజాయితీని, అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని మోసం చేస్తారని.. ఆ తర్వాత చావే శరణ్యం అని చెప్పుకొచ్చింది. మనకు సమస్యలు ఉన్నాయని.. అవి భరించలేక చావాలనిపిస్తోందని ఎవరికైనా చెబితే... వాళ్లు అప్పటి నుంచే మనల్ని సైడ్ చేస్తారని అనుపమ ఆవేదన వ్యక్తంచేసింది. ఇంకొంత మంది మన సమస్యలు విని మనల్నే ఇతరుల ముందు నవ్వుల పాలుచేస్తారని తన ఫేస్ బుక్ వీడియోలో వెల్లడించింది. 


ఇదిలావుంటే, అనుపమ పాఠక్ సూసైడ్ నోట్‌లోనూ ( Anupama Pathak suicide note ) పలు విషయాలు వెల్లడించింది. విస్డం ప్రొడ్యూసర్ అనే ప్రొడక్షన్ కంపెనీలో రూ.10 వేలు పెట్టుబడి పెట్టానని.. 2019 డిసెంబర్‌లోనే ఆ డబ్బు మెచ్యూరిటీ అయినప్పటికీ వాళ్లు ఆ డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని అనుపమ అందులో పేర్కొంది. అలాగే లాక్ డౌన్ సమయంలో తన సొంతూరిలో మ‌నీశ్ ఝా అనే వ్య‌క్తి త‌న టూవీల‌ర్ వెహికిల్ తీసుకొని ఇప్ప‌టివ‌ర‌కు తిరిగివ్వ‌డం లేద‌ని ఆరోపించింది. ఇలాంటి ఘటననే ఆమెను ఆత్మహత్య వరకు తీసుకెళ్లాయా లేక మరేదైనా ఉందా అనే కోణంలో ముంబై పోలీసులు విచారణ జరుపుతున్నారు.