అరవింద సమేత ఆడియో జ్యూక్ బాక్స్ వచ్చేసిందోచ్
అరవింద సమేత ఆడియో పాటల జ్యూక్ బాక్స్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న అరవింద సమేత సినిమా ఆడియో జ్యూక్ బాక్స్ విడుదలైంది. ప్రముఖ కంపోజర్ ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉండగా అందులో మొదట అనగనగనగా అనే పాటను, ఆ తర్వాత నిన్న సాయంత్రం పెనివిటి అనే మరో పాటను మేకర్స్ రిలీజ్ చేయగా తాజాగా విడుదలైన జ్యూక్ బాక్స్ ద్వారా మిగతా రెండు పాటలు కూడా ఆడియెన్స్ ముందుకొచ్చేశాయి.
పెనివిటి పాట విడుదలైన 24 గంటల్లోనే నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ అవడం విశేషం. అరవింద సమేత ఆడియో ఆల్బం గురించి కంపోజర్ ఎస్ఎస్ థమన్ ట్వీట్ చేస్తూ.. ఇవాళ విడుదల కానున్న ఏడపోయినాడో పాట తన కెరీర్‌లోనే అత్యుత్తమైన ట్రాక్ అని, తాను అలా ఎందుకు చెబుతున్నాననేది ఈ పాట విడుదలయ్యాక మీకే అర్థమవుతుందని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.