August Bank Holidays 2022: బ్యాంకు సంబంధిత పనులుంటే వెంటనే చేసుకోవడం మంచిది. వచ్చేవారంలో బ్యాంకు ఆరు రోజులు పనిచేయదు మరి. ఆగస్టు నెలలో బ్యాంకు సెలవులు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రక్షాబంధన్, ఇండిపెండెన్స్ డే, మొహర్రం వంటి వరుస సెలవులతో బ్యాంకులు దేశవ్యాప్తంగా మూసివేసుంటాయి. ఆగస్టు నెలలో మొత్తం 19 రోజులు బ్యాంకు సెలవులున్నాయి. ఇందులో 6 మాత్రం వీకెండ్, ప్రాంతీయ సెలవులున్నాయి. ఈ సెలవులు బ్యాంకును బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. ఆగస్టు 15న మాత్రం దేశమంతా బ్యాంకులకు సెలవుంటుంది. 


అయితే వచ్చేవారం మీకు బ్యాంకు పనులుంటే ఇబ్బంది తప్పదు. ఎందుకంటే వచ్చేవారంలో బ్యాంకులకు 6 రోజులు సెలవులున్నాయి. 


బ్యాంకు సెలవుల జాబితా


  • ఆగస్టు 8 న మొహర్రం సందర్భంగా జమ్ము శ్రీనగర్ బ్యాంకులు సెలవు

  • ఆగస్టు 9వ తేదీన మొహర్రం సందర్బంగా అగర్తల, అహ్మదాబాద్, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, చెన్నై, హైదరాబాద్, జైపూర్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూ ఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీలో బ్యాంకులకు సెలవులు

  • ఆగస్టు 11వ తేదీన రక్షాబంధన్ పురస్కరించుకుని అహ్మదాబాద్, భోపాల్, డెహ్రాడూన్, జైపూర్, షిమ్లాలో బ్యాంకు సెలవులు

  • ఆగస్టు 12వ తేదీన రక్షాబంధన్ సందర్బంగా కాన్పూర్, లక్నోలో బ్యాంకులకు సెలవులు

  • ఆగస్టు 13వ తేదీన పేట్రియాట్స్ డే సందర్భంగా ఇంఫాల్‌లో సెలవు, రెండవ శనివారం సెలవు

  • ఆగస్టు 14వ తేదీన ఆదివారం

  • ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే

  • ఆగస్టు 16వ తేదీ పార్శీ న్యూ ఇయర్ సందర్భంగా బేలాపూర్, ముంబై, నాగ్‌పూర్‌లో సెలవు

  • ఆగస్టు 18వ తేదీన జన్మాష్టమి సందర్భంగా భువనేశ్వర్, డెహ్రాడూన్, కాన్పూర్, లక్నోలో సెలవు

  • ఆగస్టు 19న జన్మాష్టమి సందర్భంగా అహ్మాదాబాద్, భోపాల్, చండీగడ్, చెన్నై, గ్యాంగ్‌టాక్, జైపూర్, జమ్ము, పాట్నా, రాంచి , షిల్లాంగ్, షిమ్లాలో సెలవు

  • ఆగస్టు 20న శ్రీ కృష్ణాష్టమి పురస్కరించుకుని హైదరాబాద్‌‌లో సెలవు


వారాంతపు సెలవులు


  • ఆగస్టు 7 ఆదివారం

  • ఆగస్టు 13 రెండవ శనివారం

  • ఆగస్టు 14 ఆదివారం

  • ఆగస్టు 21 ఆదివారం

  • ఆగస్టు 27 చివరి శనివారం

  • ఆగస్టు 28 ఆదివారం


Also read: Amazon Redmi TV Offers: అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. సగం ధరకే రెడ్‌మీ 11 సిరీస్ 32 ఇంచ్ టీవీ! ఆఫర్ క్లోజెస్ సూన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook