రాజేంద్రప్రసాద్‌కి అరుదైన పురస్కారం
చరిత్ర సృష్టించిన నటుడు రాజేంద్రప్రసాద్
హాస్య చిత్ర్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజేంద్రప్రసాద్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆయనను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. నటుడిగా విశిష్ట సేవలు అందించినందుకు ఆయనకు ఈ అవార్డు దక్కింది. మంగళవారం సిడ్నీ పార్లమెంట్ హాలులో ఆస్ట్రేలియా సాంస్కృతిక శాఖ తరఫున ఏడుగురు ఎంపీల బృందం రాజేంద్రప్రసాద్‌ను ఘనంగా సన్మానించి ఈ అవార్డుతో సత్కరించింది. సిడ్నీ పార్లమెంట్ హాలులో జరిగిన ఈ అట్టహాస వేడుకలకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
భారతదేశం నుండి ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న మొట్టమొదటి నటుడు రాజేంద్రప్రసాద్ కావడం విశేషం. రెండు నెలల క్రితం న్యూజెర్సీ అసెంబ్లీ కూడా రాజేంద్రప్రసాద్‌ను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది.
రాజేంద్రప్రసాద్ సినీ జీవితంలో దాదాపు 240 సినిమాల్లో నటించారు. ఎర్రమందారం, ఆ నలుగురు చిత్రాలకు నంది అవార్డులు అందుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో ఆయన్ను సత్కరించింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు..తాను రాజేంద్రప్రసాద్‌కు అభిమానినని పలు సందర్భాల్లో చెప్పారు. క్విక్ గన్ మురుగన్ అనే చిత్రంలో హాలీవుడ్‌లోనూ మెప్పించారు రాజేంద్రప్రసాద్.