సాధారణంగా ఎవరైనా సెలబ్రిటీలు కనిపిస్తే ఏం చేస్తాం.. వెంటనే పరుగెత్తుకెళ్లి ఆటోగ్రాఫ్ ప్లీజ్ అని అడుగుతుంటారు. అయితే తన చిన్నతనంలో ఓ భారత క్రికెటర్ నుంచి ఆటోగ్రాఫ్ తీసుకుని చాలా బాధపడ్డాను, మనసుకు ఏదోలా అనిపించింది అంటున్నాడు సీనియర్ నటుడు. అందుకు తాను ఆటోగ్రాఫ్ ఇస్తే అలా మాత్రం చేయనంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ప్రియుడితో లేడీ కానిస్టేబుల్ క్వారంటైన్.. ఊహించని ట్విస్ట్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అతను మరెవరో కాదు ఒకప్పటి లవర్ బాయ్, స్టార్ హీరో ఆర్ మాధవన్. తనకు 8 ఏళ్ల వయసులో భారత క్రికెటర్(అప్పటి) వద్ద ఎంతో మంది ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడాన్ని చూశానన్నాడు. తాను కూడా వెళ్లగా ఆ క్రికెటర్ మొత్తం 50 మందికి ఆటోగ్రాఫ్స్ ఇచ్చాడని తెలిపాడు. అయితే కనీసం తన ఫ్యాన్స్ ముఖం కూడా చూడకుండా ఆటోగ్రాఫ్ ఇచ్చేసరికి మాధవన్‌ను బాధించిందని వీడియోలో వెల్లడించాడు. అందుకే తాను ఆటోగ్రాఫ్ ఇవ్వాల్సి వస్తే.. కచ్చితంగా వారి కళ్లల్లోకి చూస్తానని చెప్పుకొచ్చాడు.  సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్



ప్రస్తుతం ఈ వీడియో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాధవన్ మీరు సూపర్, అందుకే నేను మీకు ఫ్యాన్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా, ఇటీవల బోర్డు ఎగ్జామ్స్ ఫలితాలు వచ్చిన సమయంలో విద్యార్థులలో ఉత్సాహం నింపేందుకు తన మార్కుల వివరాలు పోస్ట్ చేశాడు. నాకు కేవలం 58శాతం మార్కులే వచ్చాయి, జీవితం ఇక్కడే మొదలవ్వలేదని గుర్తుంచుకోవాలంటూ ఫెయిలైన విద్యార్థులకు మాధవన్ మంచి సందేశాన్నిచ్చాడు.  మోడల్ Shweta Mehta Hot Photos వైరల్
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..