యూనివర్సిటీ హాల్ టికెట్‌లో అమితాబ్ ఫోటో
పరీక్షల హాల్ టికెట్‌లో అమితాబ్ ఫోటో
ఓ యూనివర్శిటీ విద్యార్థికి జారీ చేసిన హాల్ టికెట్‌లో బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఫోటో దర్శనమిచ్చింది. ఉత్తర్ ప్రదేశ్‌లో ఫైజాబాద్‌లోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవద్ యూనివర్సిటీలో ఈ తప్పిదం జరిగింది.
డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్శిటీకి చెందిన ఓ కాలేజీలో అమిత్ ద్వివేది అనే విద్యార్థి బీఈడీ చదువుతున్నాడు. బీఈడీ రెండో సంవత్సరం పరీక్షలు రాసేందుకు అమిత్ అప్లికేషన్ ఫామ్‌ను నింపి ఫోటో అతికించి పరీక్షలకు ఫీజు కట్టాడు. తాజాగా యూనివర్శిటీ అధికారులు తనకు పంపించిన హాల్ టికెట్‌ను తీసుకోగా.. అందులో తన ఫోటో బదులు బాలీవుడ్ సినీనటుడు అమితాబ్ బచ్చన్ ఫొటో దర్శనమిచ్చింది. తాను మాత్రం తన ఫోటోనే అప్‌లోడ్ చేశానని.. కానీ బిగ్‌బి ఫోటోతో హాల్ టికెట్ రావడం ఆశ్చర్యానికి గురిచేసినట్లు అమిత్ చెప్పాడు. ఈ తప్పిదంపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయగా.. మార్కుల జాబితాలో తన ఫోటో వచ్చేలా హామీ ఇచ్చారు.