సినీ జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం "బాహుబలి" చిత్రం అనడంలో అతిశయోక్తి లేదు. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులకు కనువిందు చేయడమే కాదు,,  దాదాపు రూ.1000 కోట్ల రూపాయలు వసూలు చేసి తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. ఇటీవలే జపాన్ దేశంలో కూడా బాహుబలి విడుదలైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేవలం విడుదల అవ్వడం మాత్రమే కాదు.. అక్కడ 100 రోజులు ఆడి రూ.1.3 మిలియన్ డాలర్లను కూడా వసూలు చేసింది. అయితే ఇప్పుడు ఇదే సినిమా చైనాలో రికార్డులు బ్రేక్ చేయడానికి సిద్ధమవుతోంది. రేపు చైనాలో బాహుబలి 2 చిత్రం ఐమాక్స్ ఫార్మాట్‌‌లో 7000 తెరలపై విడుదల అవుతోంది. అన్ని తెరలపై చైనాలో ఓ భారతీయ చిత్రం విడుదలవ్వడం విశేషమైనా.. అదే ఘనతను గతంలో భ‌జ‌రంగీ భాయిజాన్ చిత్రం కూడా సాధించింది. చైనాలో 8000 తెరలపై ఈ చిత్రం విడుదలైంది


ఇప్పటికే దంగల్ చిత్రం చైనాలో దుమ్మురేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాహుబలి చిత్రం కూడా చైనాలో రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టాలని భావిస్తోంది. విడుదల అవ్వక ముందే చైనాలో బాహుబలి కడపటి వార్తలు అందే సమయానికి $250,000 వసూళ్లు సాధించడం విశేషం. మరి చైనా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఈ చిత్రం ఆకర్షిస్తుందో లేదో తెలుసుకోవాలంటే మాత్రం వేచి చూడాల్సిందే