July Bank Holidays 2022: ప్రాంతాన్ని బట్టి, రాష్ట్రాన్ని బట్టి బ్యాంకు సెలవుల్లో తేడా ఉంటుంది. ప్రతినెలా మీ బ్యాంకు ఎప్పుడెప్పుడు సెలవుందనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మిగిలిన సగం జూలై నెలలో కూడా బ్యాంకు సెలవులున్నాయి. అవేంటో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జూలై నెల సగమైపోయింది. వివిధ ప్రైవేట్, పబ్లిక్ బ్యాంకులకు ప్రాంతాన్ని బట్టి సెలవులుంటాయి. ప్రతి నెలా మీ బ్యాంకుకు ఎప్పుడెప్పుడు సెలవులనేది తెలుసుకుంటే..బ్యాంకు సంబంధిత పనులకు ఇబ్బంది రాకుండా చూసుకోవచ్చు. ఆర్బీఐ ప్రతినెలా వివిధ బ్యాంకుల సెలవు రోజుల్ని ముందుగానే ప్రకటిస్తుంటుంది. ఏడాది సెలవుల్ని ముందుగానే ప్రకటించినా..నెలవారీ సెలవులు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. ఇప్పుడు జూలైలో 15 రోజులు మాత్రమే మిగిలాయి. ఈ పదిహేను రోజుల్లో 6 రోజులు తిరిగి బ్యాంకుల సెలవులున్నాయి..


చాలావరకూ సెలవులు ప్రాంతీయంగా ఉన్నందున..రాష్ట్రాన్ని బట్టి, బ్యాంకును బట్టి సెలవులు మారుతుంటాయి. జూలై నెలలో 14 సెలవులుంటే..ఇప్పటికే 8 సెలవులు అయిపోయాయి. మిగిలిన సెలవుల్లో కొన్ని ప్రాంతీయంగా ఉంటే..కొన్ని జాతీయంగా ఉన్నాయి. జూలై 16 అంటే ఇవాళ డెహ్రాడూన్‌లో సెలవుండగా..మిగిలిన ప్రాంతాల్లో బ్యాంకులు తెరిచే ఉన్నాయి. నెగోషియెబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడేస్ అండ్ బ్యాంక్స్, హాలిడేస్ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు కేటగరీల్లో సెలవులు విభజిస్తుంది. ఇందులో నెగోషియెబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం ఎక్కువ సెలవులుంటాయి.


ప్రస్తుతం జూలై నెలలో మిగిలిన 15 రోజ్లులో 6 రోజులు బ్యాంకులకు సెలవులున్నాయి. అవేంటో చూద్దాం. బ్యాంకు సంబంధిత పనులుంటే సెలవుల జాబితా చూసుకుని..అందుకు తగ్గట్టుగా మీ పనులు ప్లాన్ చేసుకోండి. 


జూలై 16                            హరేలా, డెహ్రాడూన్
జూలై26                             కేర్ పూజా, అగర్తల
జూలై 17                            ఆదివారం
జూలై 23                            చివరి శనివారం
జూలై 24                            ఆదివారం
జూలై 31                            ఆదివారం


Also read; Flipkart Smart TV Offers: ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్.. రూ.28 వేలు విలువ చేసే రియల్‌మీ స్మార్ట్ టీవీ కేవలం రూ.5099కే..



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.