Flipkart Smart TV Offers: ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్.. రూ.28 వేలు విలువ చేసే రియల్‌మీ స్మార్ట్ టీవీ కేవలం రూ.5099కే..

Flipkart Smart TV Offers:  ఫ్లిప్‌కార్ట్‌ ఎలక్ట్రానిక్ సేల్‌లో బడ్జెట్ స్మార్ట్ టీవీలపై బిగ్ డిస్కౌంట్స్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ ద్వారా రూ.28 విలువ చేసే రియల్‌మీ స్మార్ట్ టీవీని చౌక ధరకే కొనుగోలు చేయవచ్చు.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 16, 2022, 03:20 PM IST
  • ఫ్లిప్‌కార్ట్‌లో లేటెస్ట్ ఆఫర్స్
  • ఎలక్ట్రానిక్ సేల్ పేరిట బిగ్ డిస్కౌంట్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్
  • ఈ నెల 18 వరకు అందుబాటులో ఎలక్ట్రానిక్ సేల్ ఆఫర్
Flipkart Smart TV Offers: ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్.. రూ.28 వేలు విలువ చేసే రియల్‌మీ స్మార్ట్ టీవీ కేవలం రూ.5099కే..

Flipkart Smart TV Offers: ప్రముఖ ఈకామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో 'ఎలక్ట్రానిక్ సేల్' ఆఫర్ అందుబాటులో ఉంది. రెండు రోజుల క్రితం ప్రారంభమైన ఈ సేల్ మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ సేల్ ద్వారా రూ.99 విలువ చేసే వస్తువులు మొదలు రూ.1 లక్ష విలువ చేసే వస్తువుల వరకు భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. చౌక ధరలో బెస్ట్ బ్రాండ్స్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఈ సేల్‌లో భాగంగా బడ్జెట్ స్మార్ట్ టీవీలపై కూడా భారీ తగ్గింపు లభిస్తోంది. రూ.28 వేలు విలువ చేసే రియల్‌మీ 108 సెం.మీ (43 అంగుళాలు) స్మార్ట్ టీవీని ఈ సేల్‌లో కేవలం రూ.5099కే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ డిస్కౌంట్ :

ప్రస్తుతం మార్కెట్లో రియల్‌మీ 108 సెం.మీ (43 అంగుళాలు) స్మార్ట్ టీవీ ధర రూ.27,999గా ఉంది. కానీ ఫ్లిప్‌కార్ట్‌ ఎలక్ట్రానిక్ సేల్‌లో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ.21,999కే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ దీనిపై 21 శాతం తగ్గింపు అందిస్తుండటంతో రూ.5 వేలు వరకు ఆదా అవుతుంది. అంతేకాదు, ఒకవేళ స్మార్ట్ టీవీ కొనుగోలుకు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడినట్లయితే మరో రూ.1500 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది. ఆ డిస్కౌంట్ కూడా వర్తించినట్లయితే ఈ స్మార్ట్ టీవీని మరింత చౌకగా.. 20499కే సొంతం చేసుకోవచ్చు.

ఎక్స్‌చేంజ్ ఆఫర్‌ :

ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ 108 సెం.మీ (43 అంగుళాలు) స్మార్ట్ టీవీపై ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్ టీవిని ఎక్స్‌చేంజ్ చేసుకున్నట్లయితే.. గరిష్ఠంగా రూ.16,900 వరకు తగ్గింపు పొందవచ్చు. పూర్తి ఎక్స్‌చేంజ్ఆఫర్ వర్తించినట్లయితే.. రూ.21,999కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ టీవిని కేవలం రూ.5099కే కొనుగోలు చేయవచ్చు. అయితే ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. జూలై 14 నుంచి జూలై 18 వరకు మాత్రమే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఎలక్ట్రానిక్ సేల్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే జూలై 18 లోపే ఆర్డర్ చేయాల్సి ఉంటుంది.

Also Read: Oppo A97 5G Price: రూ.23 వేలకే ఒప్పో కొత్త 5జీ ఫోన్.. సూపర్ స్పెసిఫికేషన్‌లు ఇవే!

Also Read: Godavari Floods LIVE: భద్రాచలం సేఫ్.. ధవళేశ్వరంలో మరో 24 గంటలు హై అలెర్ట్

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News