Before Marriage Release Date: టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు మరో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ సిద్ధమైంది. యూత్‌ను ఆకట్టుకునే స్టోరీతోపాటు మెసేజ్ ఇస్తూ రూపొందిన మూవీ బీఫోర్ మ్యారేజ్. ప్రముఖ దర్శకుడు వై.నాగేశ్వర్ రెడ్డి తనయుడు  ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. శ్రీధర్ రెడ్డి ఆటాకుల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. హనుమ క్రియేషన్స్‌పై రూపొందుతుండగా.. భరత్, నవీన రెడ్డి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఆడియన్స్ ముందుకురానుంది. SKML మోషన్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా ఆది నారాయణ ఈ మూవీని 100 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫిలిం చాంబర్‌లో మూవీ మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యఅతిథిగా హాజరైన ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. గతేడాది చిన్న సినిమాల హవా నడిచిందని.. ఈ ఏడాది 'హనుమాన్' చిత్రం కొన‌సాగించిన‌ ప్రభంజనం మాదిరిగానే చిత్రం కూడా హిట్టవ్వాలని ఆకాంక్షించారు. ట్రైలర్ చూసిన తరువాత యూత్‌కు మంచి మెసేజ్ ఇచ్చినట్లు తెలుస్తోందన్నారు. సాంగ్స్ బాగున్నాయని.. మంచి విజయం సాధించాలని మూవీ యూనిట్‌కు విష్ చేస్తున్నానని చెప్పారు. మ‌రో అతిథి ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ మాట్లాడుతూ... ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంద‌ని ట్రైల‌ర్ చూస్తేనే తెలుస్తోందన్నారు. మ్యూజిక‌ల్ హిట్‌గానూ నిలుస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చని అన్నారు. లేడీ ఓరియంటేడ్ మూవీ మాదిరిగా ఉందని.. హీరోయిన్ బాగా యాక్ట్ చేసిందన్నారు. ఇలాంటి సినిమాల‌ను ఆదరించాలని ప్రేక్షకులను కోరారు.


డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి ఆటాకుల మాట్లాడుతూ.. వివాహానికి ముందు త‌ప్పు అనిపించ‌ని పొర‌పాటుతో జీవితంలో ఒక్క‌సారిగా ఊహించ‌ని మార్పులు చోటు చేసుకుంటాయని.. ఇదే విష‌యాన్ని వాస్తవానికి దగ్గరగా తెరకెక్కించినట్లు తెలిపారు. సినిమాలో ప్రతి ఒక్కరు బాగా పని చేశారని.. ఎక్కడా కాంప్ర‌మైజ్ నిర్మాత సహకరించారని చెప్పారు. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకం ఉందన్నారు. ప్రొడ్యూసర్ ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్న విష‌య‌మే క‌దా అని యువ‌త పెడ‌దోవ ప‌డితే ఏం జ‌రుగుతుందో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించిన చిత్రం ఇది అన్నారు. యధార్థ సంఘటనల‌ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించామని.. సింగ‌ర్ మంగ్లీ పాడిన పాట భారీ హిట్ట‌వుతుందన్నారు. యువత‌కు మంచి మెసేజ్ ఇందులో ఉంటుందని.. సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నామన్నారు. 


Also Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?


Also Read: Mizoram Flight: ఎయిర్‌పోర్టులో జారిన విమానం.. పొదల్లోకి దూసుకెళ్లడంతో 12 మందికి గాయాలు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook