కరోనా కష్టకాలంలో రక్తదానం చేయడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. రక్తదానం చేసేవారిలో గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు 88శాతం వరకు తగ్గుతాయట. ఎలాంటి రకమైన గుండె జబ్బులు, గుండెకు సంబంధిత ఆరోగ్య సమస్యలు 33శాతం తగ్గుతాయని చెబుతున్నారు. ఒక్కసారి రక్తదానం చేస్తే మన శరీరంలో ఉండే ఐరన్ (ఇనుము)లో 225 నుంచి 250 మిల్లీగ్రాములు కోల్పోయి గుండె జబ్బులకు గురయ్యే ప్రమాదం తగ్గుతుంది.  బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకసారి రక్తదానం చేస్తే కేవలం రెండు రోజుల వ్యవధిలో (48 గంటల్లో) శరీరం ఆ రక్తాన్ని భర్తీ చేసుకుంటుంది. కనుక మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని, దీని వల్ల మీ ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు దాత నుంచి రక్తం సేకరించిన బ్లడ్ బ్లాంక్‌లు, ఆసుపత్రులు వారి రక్తానికి పలు రకాల పరీక్షలు చేస్తారు. ఒకవేళ దాతకు ఏదైనా అనారోగ్య సమస్య మొదలవుతుంటే బ్లడ్ టెస్టుల్లో బయటపడుతుంది. మెడికల్ సిబ్బంది నుంచి సమాచారం అందుకుని సంబంధిత వ్యాధికి, అనారోగ్య సమస్యకు వెంటనే ప్రాథమిక దశలోనే చికిత్స తీసుకుని మీ ప్రాణాలను కాపాుడుకోవచ్చు. తొడలు లావుగా ఉన్నాయా.. అయితే మీకు శుభవార్త


ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని ఐపీఎం (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్)కి స్టాండ్ ఎలోన్ బ్లడ్ బ్యాంక్‌గా గుర్తింపు ఇచ్చింది. ఇక్కడికి వచ్చి దాతలు ఎవరైనా, ఎప్పుడైనా రక్తదానం చేయవచ్చు. 040-29569047 నెంబర్‌కి ఫోన్ చేస్తే రక్తదానం చేయాలనుకునేవారికి అపాయింట్‌మెంట్‌తో పాటు అవసరమైన పాస్ పంపిస్తారు. రక్తదానం చేయాలనుకుంటున్నట్లు చెబితే పోలీసులు సైతం తమ వాహనంలో తీసుకెళ్లి తిరిగి ఇంటి దగ్గర సురక్షితంగా దిగబెట్టే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.    జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా! 


Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!