న్యూఢిల్లీ: భారతీయ వినియోగదారుల మొత్తం సమాచారాన్ని సేకరిస్తున్న చైనాకు చెందిన 52 యాప్స్‌ను అడ్డుకోవాలంటూ ఇటీవల ఇంటెలిజెన్స్‌ వర్గాలు ప్రధాని నరేంద్ర మోదీకి నేరుగా విజ్ఞప్తి చేశాయంటూ వార్తలు వచ్చాయి. అయితే అడ్డుకోవాలని కోరుతున్న యాప్స్‌ జాబితాలో భారత్‌లో అత్యధిక ప్రాచుర్యం పొందిన టిక్‌టాక్, షేర్‌ ఇట్, బిగో లివ్, క్లబ్‌ ఫ్యాక్టరీ, షైన్, హెలో తదితర యాప్స్‌ ఉన్నాయి. ఈ యాప్స్‌ అన్నీ భారత ఆర్థిక వ్యవహారాలకు ఉపయోగపడుతున్నాయి. వీటిలో టిక్‌టాక్, హలో, బిగో వీడియో యాప్‌లు సోషల్‌ మీడియా ద్వారా ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చాయి. టిక్‌టాక్‌కు భారత్‌లో నెలవారిగా 12 కోట్ల మంది, హెలోకు ఐదు కోట్ల మంది, బిగో లివ్‌కు 2.20 కోట్ల మంది ఉన్నారు. అంతేకాకుండా క్లబ్‌ ఫ్యాక్టరీకి పది కోట్ల మంది, షైన్‌కు 50 లక్షల మంది డౌన్‌లోడర్లు ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: సీఏం కేసీఆర్ సూర్యాపేట పర్యటన ఖరారు..


ఇదిలాఉంటే స్మార్ట్‌ఫోన్ల ద్వారా సెల్ఫీల మోజు పెరగడంతో సెల్ఫీల్లో అందంగా కనిపించడం కోసం బ్యూటీప్లస్, మేకప్‌ప్లస్‌ లాంటి యాప్స్‌ను కూడా చైనావే. భారతీయ వినియోగదారుల కోసమే ‘బ్యూటీప్లస్‌ మీ’ అంటూ మరో యాప్‌ను సృష్టించింది. వీటితోపాటు ఫొటో వాండర్, యూకామ్‌ మేకప్, సెల్ఫీసిటీ, వాండర్‌ కెమేరా, పర్‌ఫెక్ట్‌ కోర్‌ అనే మరో నాలుగు బ్యూటీ యాప్స్‌ను కూడా అడ్డుకోవాలని ఇంటెలిజెన్స్‌ వర్గాలు కోరుతున్నాయి. ఫైల్‌ షేరింగ్‌ టూల్స్‌గా ఉపయోగపడుతున్న షేర్‌ఇట్, క్సెండర్‌ యాప్స్‌ కూడా ఉన్నాయి. షేర్‌ఇట్‌కు దేశంలో 40 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. 
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ