Best Airtel Recharge Plan 2023: ఎయిర్‌టెల్ చౌకైన రీఛార్జ్ ప్లాన్.. 56 రోజుల పాటు పండగే పండగ! ఫుల్ డిమాండ్
Airtel 549 prepaid recharge plan with 2GB daily data and Unlimited calling for 56 days. సరసమైన ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 549. ఈ ప్లాన్‌లో 56 రోజుల చెల్లుబాటు అందుబాటులో ఉంది.
Airtel 549 prepaid recharge plan with 2GB daily data and Unlimited calling for 56 days: దేశీయ దిగ్గజ టెలికం కంపెనీల్లో 'భారతీ ఎయిర్‌టెల్' అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తోంది. దేశంలో అత్యధిక కస్టమర్లు ఎయిర్‌టెల్‌కు మాత్రమే ఉన్నారు. అగ్ర స్థానంలో ఉన్న ఎయిర్‌టెల్.. ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొస్తుంది. కొన్ని ఖరీదైన ప్లాన్‌లలో లభించే ప్రయోజనాలు కూడా చౌకైన ప్లాన్‌లో ఉంటాయి. అయితే మీరు ప్రతి నెలా ప్రీపెయిడ్ ప్లాన్‌ను రీఛార్జ్ చేయకూడదనుకుంటే.. మీ కోసం సరసమైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ని (Airtel Prepaid Recharge Plan) ఎయిర్‌టెల్ అందిస్తోంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌కు ఫుల్ డిమాండ్ ఉంది.
ఎయిర్‌టెల్ సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ. 549 (Airtel 549 Plan). ఈ ప్లాన్ అతి పెద్ద ప్రయోజనం ఏమిటంటే.. ఇందులో 56 రోజుల చెల్లుబాటు అందుబాటులో ఉంది. ఈ ఒక్క కారణంగా ఎయిర్‌టెల్ కస్టమర్లు దీన్ని ఎక్కువగా రీఛార్జ్ చేసుకుంటున్నారు. ఈ రీఛార్జ్‌ని ఒకసారి యాక్టివేట్ చేసిన తర్వాత మీరు దాదాపుగా 2 నెలల పాటు రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే రీఛార్జ్ తేదీని కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ధర, ప్రయోజనాల కారణంగా ఈ ప్లాన్‌కు మంచి డిమాండ్ ఉంది.
రూ. 549 ప్లాన్‌లో లభించే ప్రయోజనాల గురించి ఓసారి తెలుసుకుందాం. 56 రోజుల పాటు వినియోగదారులకు ప్రతిరోజూ 2GB డేటా అందించబడుతుంది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఐపీఎల్ 2023 లైవ్ మ్యాచ్ వీడియోలు చూడటం లేదా పాటలు వినడంతో పాటు సోషల్ మీడియాను కూడా ఈ 2GB డేటాతో రన్ చేయొచ్చు. అలానే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి కూడా ఈ డేటా బాగా సరిపోతుంది. స్కూల్, కాలేజ్ విద్యార్థులు కూడా ఈ సమ్మర్ బాగా గడిచిపోతుంది.
రూ. 549 రీఛార్జ్ ప్లాన్‌లో 56 రోజుల వాలిడిటీ ఉంటుంది. వినియోగదారులు 56 రోజుల పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ మరియు రోమింగ్ కాల్‌లను నిరంతరం చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో ఎస్ఎంఎస్ (SMS)లు కూడా ఇవ్వబడుతుంది. ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌కు కస్టమర్ వినియోగించుకోవచ్చు. అంతేకాదు కొన్ని యాప్ సుబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీగా ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్, ఐపీఎల్ 2023 చూసేసరికి ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది.
Also Read: MI vs CSK Dream11 Team: ఐపీఎల్ టాప్ జట్లు ముంబై, చెన్నై మధ్య బిగ్ ఫైట్.. డ్రీమ్ 11 టీమ్ ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.