నటీనటులు : మహేష్, కైరా అద్వానీ, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, ఆమని, రవి శంకర్ తదితరులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినిమాటోగ్రఫీ : రవి కె.చంద్రన్, తిరు


సంగీతం : దేవిశ్రీ ప్రసాద్


నిర్మాణం : డి.వి.వి ఎంటర్‌టైన్‌మెంట్


నిర్మాత : డి.వి.వి.దానయ్య


రచన-దర్శకత్వం : కొరటాల శివ


విడుదల తేది : 20 ఏప్రిల్ 2018
 
భరత్ అనే నేను.. ప్రమాణం చేస్తున్నాను అనేది ఈ సినిమాలో సూపర్ హిట్ డైలాగ్. దాదాపు ఇలాంటి ప్రమాణాన్నేఅభిమానులకు కూడా ఇచ్చాడు మహేష్. ఈసారి సూపర్ హిట్ సినిమా అందిస్తానన్నాడు. సినిమాలో మాటనిలబెట్టుకున్నట్టుగానే, బయట కూడా ఫ్యాన్స్ కు ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకున్నాడు. భరత్ అనే నేను పై జీసినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ


కథ :
లండన్ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో స్టడీస్ పూర్తి చేసిన భరత్ రామ్ తన తండ్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాఘవ రాజు(శరత్ కుమార్) హఠాన్మరణంతో ఇండియాకి వస్తాడు. అలా ఇండియాకి వచ్చిన భరత్ తమ నవోదయం పార్టీలోకీలక బాధ్యతలు వహిస్తున్న రాఘవ రాజు స్నేహితుడు వరదరాజు(ప్రకాష్ రాజ్)కోరిక మేరకు ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకుంటాడు. వెంటనే ట్రాఫిక్, ఎడ్యుకేషన్ వంటి కీలక అంశాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాడు. 


ప్రతిపక్ష నేతశ్రీపతి(దేవరాజ్)కొడుకు మనోహర్(యష్ పాల్ శర్మ)అవినీతిని బయటపెట్టేందుకు తన పార్టీ లీడర్ కే ఎదురుతిరుగుతాడు. ఇక రాయలసీమలో రాచకొండ అనే గ్రామంలో దౌర్జన్యాలు చేస్తూ చలామణీ అవుతున్న తన పార్టీ వాడైన దాము(రవి శంకర్)కి రమణ(రాహుల్ రామకృష్ణ)ను పోటీగా నిలబెట్టి దాముకి శత్రువుగా మారతాడు. అయితే ఈక్రమంలో తను ప్రేమించిన వసుమతి(కైరా అద్వాని) వల్ల భరత్ కి సమాజంలో ఉన్న పేరు పోయి చెడ్డ పేరు వస్తుంది.దీంతో భరత్ రాజీనామా చేస్తాడు. భరత్ రాజీనామా చేయడంతో వరదరాజులు సీఎం అవుతాడు. తిరిగి లండన్ వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు భరత్. కాని ప్రజలకి ఇచ్చిన మాట కోసం తన నిర్ణయం మార్చుకుని ప్రజలకు ఒక ప్రెస్ మీట్ ద్వారా నిజాలు చెబుతాడు. చివరికి తన తండ్రి మరణం వెనుక ఉన్న వ్యక్తి నిజస్వరూపం తెలుసుకొని తన ప్రమేయం లేకుండానే ఆ వ్యక్తిని ఎలా అంతమొందించాడు… మళ్ళీ ఎలా సీఎం అయ్యాడనేది బ్యాలెన్స్ కథ.




 
నటీనటుల పనితీరు :
నటుడిగా ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్న మహేష్ మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పాత్రలోమెప్పించాడు. ఓ యంగ్ సీఎంగా తన పెర్ఫార్మెన్స్ తో సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు. తన కెరీర్ లో మహేష్గర్వంగా చెప్పుకునే పాత్రల్లో భరత్ కూడా ఒకటి. బాలీవుడ్ లో హీరోయిన్ గా ఇప్పటికే తానెంతో నిరుపించుకున్న కైరాఅద్వాని వసుమతి అనే క్యారెక్టర్ చేసింది. తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు కైరాలో ఉన్నాయి. ప్రకాష్ రాజ్తన నటనతో మరోసారి మెస్మరైజ్ చేశాడు. ఇప్పటికే విలన్ గా మంచి మార్కులు అందుకున్న రవి శంకర్ తనమరోసారి ఆకట్టుకున్నాడు. రాహుల్ రామకృష్ణ కమెడియన్ గా మాత్రమే కాకుండా క్యారెక్టర్ అర్టిస్ట్ గా కూడాఆకట్టుకోగలడని నిరూపించుకున్నాడు. సీరియస్ గా సాగే ఈ సినిమాలో పోసాని, పృథ్వి, బ్రహ్మాజీ చెరొకసారి తమకామెడి టైమింగ్ తో అలరించారు. శరత్ కుమార్, ఆమని, దేవరాజ్, రావు రమేష్, యాష్ పాల్ శర్మ, అజయ్ ,జయలలిత, బెనర్జీ, శత్రు తదితరులు తమ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నారు.
 
సాంకేతికవర్గం పనితీరు:
ఈ సినిమాకు వర్క్ చేసిన టెక్నీషియన్స్ అంతా ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు. రవి కే చంద్రన్, తిరు సినిమాటోగ్రఫీచాలా బాగుంది. అందంగా ఉండే మహేష్ కొన్ని ఫ్రేమ్స్ లో ఇంకా అందంగా కనిపించాడు. ఈసారి దేవిశ్రీ పాటల కంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎక్కువ ఆకట్టుకోవడం విశేషం. టైటిల్ సాంగ్, వచ్చాడయ్యో సామి పాటలు బాగున్నాయి.రామజోగయ్య శాస్త్రి ఈ సినిమాకు సాహిత్యం అందించడంతో పాటు ఓ సాంగ్ లో మెరుపులా మెరిశారు కూడా. ఆర్ట్ వర్క్ బాగుంది. సినిమాకోసం ప్రత్యేకంగా వేసిన అసెంబ్లీ సెట్ తో పాటు, వచ్చాడయ్యో స్వామి కోసం వేసిన టెంపుల్ సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. కొన్ని సందర్భాల్లో వచ్చే ఎమోషనల్, పవర్ ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. కొరటాల శివ స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది. డీ.వి.వి. ఎంటర్టైన్ మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.


జీ సినిమాలు సమీక్ష :
ఒక రోజు ముఖ్యమంత్రి కాన్సెప్ట్ తో ఒకే ఒక్కడు వచ్చింది. యంగ్ సీఎం క్యారెక్టర్ తో లీడర్ సినిమా వచ్చింది. ఈ రెండు సినిమాల మధ్యలో పొలిటికల్ టచ్ తో మరికొన్ని సినిమాలు కూడా వచ్చాయి. భరత్ అనే నేను సినిమా విడుదల తర్వాత పైన చెప్పుకున్న సినిమాలతో దీన్ని పోల్చాలని చాలామంది సిద్ధమయ్యారు. కానీ ఈ భరత్ అందరిలాంటివాడు. ఇతడు అంతకంటే స్పెషల్.
తండ్రి చనిపోతే కొడుకు సీఎం అవ్వడం అనేది లీడర్ లోనే చూశాం. ముఖ్యమంత్రిగా ఫైట్స్ చేయడం, ఊహించనివిధంగా నిర్ణయాలు తీసుకోవడం ఒకే ఒక్కడులో చూశాం. ఆ రెండు ఎలిమెంట్స్ ఇందులో కనిపిస్తాయి కానీ ‘భరత్ అనే నేను’ సినిమా వాటితో పోల్చడానికి లేదు. 



ఇది పూర్తిగా రాజకీయ నేపథ్యంలో సాగే పొలిటికల్ సెటైరికల్ ఫిక్షనల్ఎంటర్ టైనర్.మంచి కథలో ఎమోషన్ పండితే సినిమా అటోమేటిగ్గా పాస్ అయిపోతుందనే విషయాన్ని కొరటాల ఎప్పుడో పసిగట్టాడు. మరీ ముఖ్యంగా జనాలకు కనెక్ట్ అయ్యే సన్నివేశాలు, పాత్రల్ని చూపిస్తే సినిమాకు ఢోకా ఉండదనే విషయం ఈ రచయిత కమ్ దర్శకుడికి బాగా తెలుసు. సరిగ్గా ఇవే పునాదులపై రాసుకున్న కథ భరత్ అనే నేను. చిన్న చిన్న సమస్యలకే ఫిక్షనల్ సొల్యూషన్స్ తో కొరటాల రాసుకున్న సన్నివేశాలు, స్క్రీన్ ప్లే సినిమాకు ప్రాణం పోశాయి. అలా ఫస్టాఫ్ మొత్తాన్ని పకడ్బందీగా నడిపించిన దర్శకుడు.. సెకెండాఫ్ లో మాత్రం కాస్త తడబడ్డాడు. 


ఎక్కడ కట్ చేయాలో తెలీక, కట్ చేస్తే ఏమౌతుందో అనే సంశయంతో కనిపించాడు. ఇలాంటి సంశయాల్ని కూడా అధిగమించేలా మహేష్ తన మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ తో భరత్ ను ఫుల్ మార్కులతో పాస్ చేయించాడు. దీన్నొక కల్పిత కథగా కొరటాల చెబుతున్నప్పటికీ ప్రస్తుతం రాజకీయాలకు అన్వయించుకునే సన్నివేశాలు, సందర్భాల్లో సినిమాలో చాలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా సినిమాలో అసెంబ్లీ సమావేశాలు నేటి రాజకీయ పరిస్థితుల్ని కళ్లకుకడతాయి. వీటికి తోడు కొరటాల టచ్ చేసిన సమస్యలు కూడా అందరికీ సంబంధించినవి కావడంతో భరత్ ఈజీగా ఆడియన్స్ కు కనెక్ట్ అయిపోయాడు.


కొరటాల సినిమాల్లో ఓ చిన్న మేజిక్ కనిపిస్తుంది. గ్రాఫ్ పడిపోతుందని ఆడియన్స్ ఫీల్ అయిన ప్రతిసారి ఓ బలమైన సీన్ తో సినిమాను లేపుతుంటాడు. ఈ సినిమా సెకండాఫ్ లో కూడా కొరటాల అదే పని చేశాడు. ఓ అదిరిపోయే ఫైట్ తో పాటు 2 ట్విస్టులతో సినిమా గ్రాఫ్ పడకుండా చూసుకున్నాడు. దీంతో పాటు తన ప్రతి సినిమాలో చేస్తున్నట్టుగానే, ఈసినిమాతో కూడా ఓ సామాజిక సందేశాన్నిచ్చాడు.
 
ప్లస్ పాయింట్స్

– మహేష్ లుక్, పెర్ఫార్మెన్స్
– కొరటాల కథ, డైరక్షన్
– అసెంబ్లీ సెట్
– రాయలసీమ ఎపిసోడ్
– బ్యాక్ గ్రౌండ్ స్కోర్
 
మైనస్ పాయింట్స్
– సెకండాఫ్ కాస్త సాగదీసినట్టు అనిపించడం
– అన్ని పాటలూ క్లిక్ అవ్వకపోవడం
– ఊహించే విధంగా క్లయిమాక్స్ ఉండడం
 
బాటమ్ లైన్ – భరత్ అదరగొట్టాడు
 
రేటింగ్ – 3.5/5


(జీ సినిమాలు సౌజన్యంతో)