అందాల భామ గల్లీ క్రికెట్ ఆడితే. .
బాలీవుడ్ బ్యూటీ క్వీన్ . . అందాల భామ భూమి ఫెడ్నేకర్. `పతీ పత్నీ ఔర్ వో` చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఈ బుట్ట బొమ్మ. . 2019లో సూపర్ హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకుంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించింది.
బాలీవుడ్ బ్యూటీ క్వీన్ . . అందాల భామ భూమి ఫెడ్నేకర్. 'పతీ పత్నీ ఔర్ వో' చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఈ బుట్ట బొమ్మ. . 2019లో సూపర్ హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకుంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం భూమి పెడ్నేకర్ హీరో అక్షయ్ కుమార్ 'దుర్గావతి' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్. . ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరుగుతోంది. షూటింగ్ సందర్బంగా ఈ అందాల భామ సందడి చేసింది. గల్లీ క్రికెట్ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచింది.
భూమి పెడ్నేకర్ .. చిన్న పిల్లలతో సరదాగా క్రికెట్ ఆడుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందాల భామ భూమి పెడ్నేకర్ గల్లీ క్రికెట్ ఆడితే ఆ సందడే వేరు అన్న విధంగా వీడియో కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను నెటిజనులు తెగ లైక్ చేస్తున్నారు. గల్లీ గర్ల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు హీరోయిన్ ను చూసేందుకు గ్రామంలోని చాలా మంది వచ్చారు.
Read Also: విదేశాల్లో ఎంఎస్ ధోనీ సందడే సందడి..
'దుర్గావతి' సినిమాను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నిర్మిస్తున్నారు. తెలుగులో 'బాగమతి' సినిమాకు ఇది రీమేక్. ఈ ఏడాది భూమి పెడ్నేకర్ నటించిన 'భూత్' సినిమా పార్ట్ -1 కు విడుదలకు సిద్ధంగా ఉంది.