కూరగాయలమ్ముతున్న నటుడు..
కరోనా మహ్మమరి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దీని ప్రభావం సమాజంలోని అన్నీ రంగాల మీద ప్రభావం చూపుతోంది. చాలా మంది ఉద్యోగాలు కొల్పోయారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో పనిచేసే
హైదరాబాద్: కరోనా మహ్మమరి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దీని ప్రభావం సమాజంలోని అన్నీ రంగాల మీద ప్రభావం చూపుతోంది. చాలా మంది ఉద్యోగాలు కొల్పోయారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు, చిన్న చిన్న నటుల, ఆర్టిస్టుల కష్టాలు ఒక్కసారిగా రోడ్డున పడ్డాయి. ఈ చిరుద్యోగులకు లాక్‌డౌన్ కష్టాలు జీవన ప్రమాణాలను మరింత ధ్వంసం చేశాయి. ఇటు టాలీవుడ్ లో, అటు బాలీవుడ్ లో అన్నీ స్థాయిల్లోని ఉద్యోగాలకు సంస్థలు గుడ్ బై చెప్పేస్తున్నాయి. కోటి దాటిన కరోనా కేసులు.. మరణాలు ఐదు లక్షలకుపైనే..
Also Read: Pakistan Stock Exchangeపై ఉగ్రదాడి.. నలుగురు ఉగ్రవాదులు సహా 10 మంది మృతి
మరోవైపు తాజాగా యాక్టర్ జావేద్ హైదర్ సినిమా షూటింగులు జరగకపోవడంతో కూరగాయలు అమ్ముకుంటూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో టిక్‌టాక్‌లో వైరల్ గా మారింది. దీనికి లక్షల్లో లైకులు, మిలియన్లలో వ్యూస్ సంపాదించిపెట్టింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలోనూ మానసిక సంఘర్షణకు లోనుకాకుండా నూతన మార్గాన్ని ఎంచుకుని తనకు తానుగా ధైర్యంగా మలుచుకోవడం ద్వారా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే అతని బ్రతకడానికి ఏదో ఒక న్యాయమైన పని చేస్తున్నాడని, జీవితంలో ఎప్పుడూ ఆశ కొల్పోకూడదంటూ టిక్‌టాక్ యూజర్లు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. కాగా జావేద్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరపై అరంగేట్రం చేశాడు. అమీర్‌ఖాన్ 'గులాం', 'లైఫ్ కీ ఐసీ కి తైసి', 'బాబర్' సినిమాల్లో నటించాడు. వీటితోపాటు 'జెన్నీ ఔర్ జుజు' అనే టీవీ సిరీస్‌లో సైత నటించాడు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ