Budget 2023: పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులకు శుభవార్త.. త్వరలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన..?
Pm Kisan Yojana: పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులకు త్వరలో శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అందజేస్తున్న నగదును పెంచాలని డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Pm Kisan Yojana: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది బడ్జెట్‌ను సమర్పించబోతున్న సందర్భంగా అన్నదాతలకు గుడ్‌న్యూస్ అందనుందని నిపుణులు చెబుతున్నారు. రైతుల ఆదాయానికి సంబంధించి భారీ ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా దెబ్బతిన్న తరువాత ఈసారి బడ్జెట్ రైతులకు ప్రత్యేక కేటాంపులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం కొత్త రికార్డుల నేపథ్యంలో ప్రజలు వచ్చే బడ్జెట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు.
పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి కూడా శుభవార్త ఉండే అవకాశం ఉంది. రాబోయే బడ్జెట్ 2023లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలో ఏటా వచ్చే రూ.6,000 మొత్తాన్ని పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఛాన్స్ ఉందటున్నారు. నిజానికి ఈ పథకం కింద చాలా రెట్లు పెంచాలనే డిమాండ్ ఉంది. అంతకుముందు సాధారణ బడ్జెట్ 2022లో కూడా కిసాన్ యోజన వాయిదా మొత్తాన్ని పెంచాలనే డిమాండ్లు భారీగా వచ్చాయి. అయితే ఈసారి బడ్జెట్‌లో తప్పకుండా ఈ పథకం మొత్తాన్ని పెంచే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ మొత్తాన్ని 6 వేల నుంచి 8 వేల రూపాయలకు పెంచి.. రైతులకు ఏడాదికి 4 విడతలుగా 2 వేల రూపాయల చొప్పున ఇవ్వవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ప్రధానమంత్రి కిసాన్ యోజన కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాలలో ఒకటి. ఈ పథకం కింద రైతుల ఖాతాల్లో మూడు విడతలుగా 2-2 వేల రూపాయలు అంటే ఏటా 6 వేల రూపాయలను జమ చేస్తోంది. ఈ పథకంలో ఇప్పటివరకు 12 విడతలు రైతుల ఖాతాల్లోకి చేరాయి. ఇప్పుడు 13వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఈ పథకం కింద నగదు పెంచితే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.
Also Read: Pawan Kalyan: నేను ఈ షర్ట్ అయినా వేసుకోవచ్చా వైసీపీ.. వారాహి కలర్ వివాదంపై పవన్ కళ్యాణ్ పంచ్
Also Read: Kharmas 2022 December: ఖర్మ సమయంలో ఈ పనులు చేస్తే అంతే సంగతి.. ఎందుకో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి