న్యూఢిల్లీ: బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వినూత్న పద్ధతులను అవలంభిస్తున్న వారి పనులను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి తన అనుభవాన్ని పంచుకోవడంలో ముందుంటారు. ఆనంద్ మహీంద్రా ఇటీవల చేసిన ట్వీట్ అలాంటి ఒక కొత్త ఆలోచనను చూపిస్తుంది. ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో ప్రజలు సామాజిక దూరాన్ని అవలంభన, ఆవశ్యకతను అవసరాలకు అనుగుణంగా ఓ వ్యక్తి ఇ-రిక్షా నమూనాను తయారు చేశారు. ఆనంద్ మహీంద్రా ఈ ప్రత్యేకమైన వాహనం వీడియో సందేశాన్నిసామాజిక మాధ్యమంలో పంచుకుని, ఈ ఆలోచనను ప్రశంసించడమే కాకుండా, ఈ ఆవిష్కరణ ద్వారా మనం ఎంతో  నేర్చుకోవాల్సిన అవసరముందని గుర్తుచేశారు. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన వీడియోలో ఇ-రిక్షా ఎలా ఉంటుందో తెలియజేస్తోంది. అయితే ఇ-రిక్షాలో నాలుగు వేర్వేరు సీటింగ్ తయారుచేబడటం, దీని ద్వారా నలుగురు ప్రయాణికులు ఇతరులతో ఎటువంటి సంబంధం లేకుండా ఒకే వాహనంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేయబడినప్పటి నుండి, ఈ వీడియో 32,000 పైగా లైక్‌లను, 6,800 కంటే ఎక్కువ రీట్వీట్‌లను సేకరించింది. ఎంతో మంది ఈ ఆలోచనను ప్రశంసించారు. ఈ వీడియోలో ఉన్న సందేశాన్ని ప్రశంసిస్తూ చాలా మంది అద్భుతమని, బ్రిలియంట్ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా అవసరం ఆవిష్కరణకు తల్లి అని మరొకరు ట్వీట్ చేశారు. చివరగా ఇది సామాజిక ఐసోలేషన్ రవాణా వ్యవస్థ అని పేర్కొన్నారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..