స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, అందాల నటి పూజా హెగ్డే జంటగా సంక్రాంతి కానుకగా వచ్చి సక్సెస్ సాధించిన సినిమా ‘అల వైకుంఠపురంలో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 12న విడుదలై రికార్డులు తిరగరాసింది. అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) సినిమాను గ్రాండ్‌గా నిర్మించారు. ఈ సినిమా గురించి మాట్లాడితే ముఖ్యంగా గుర్తొచ్చేది పాటలే. మ్యూజికల్ హిట్ సాధించడం బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు రాబట్టింది.  బికినీలో బ్యూటీలు.. సమ్మర్ మరింత హాట్!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎస్ థమన్ స్వరాలు సమకూర్చిన ‘బుట్టబొమ్మ’ సాంగ్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. గత నెలలో 100 మిలియన్ల మార్కు దాటిన ఈ బుట్టబొమ్మ వీడియో సాంగ్ తాజాగా 150 మిలియన్ల మార్కు చేరుకోవడం విశేషం. 15 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో బుట్టబొమ్మ సరికొత్త రికార్డులు తన ఖాతాలో వేసుకుంటోంది. 'సామజవరగమణ', 'రాములో.. రాములా' పాటలు సైతం తెలుగు ప్రేక్షకుల మనసు దోచాయి.



ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి కలం నుంచి జాలువారిన ఈ రొమాంటింగ్ సాంగ్‌ను సింగర్ అర్మన్ మాలిక్ అద్భుతంగా ఆలపించాడు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమా మ్యూజికల్ హిట్‌తో మరో మెట్టు ఎదిగాడు. బుట్టబొమ్మ సాంగ్ అరుదైన క్లబ్‌లో చేరడంపై అల వైకుంఠపురములో మూవీ యూనిట్ హర్షం వ్యక్తం చేస్తోంది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా! 


Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!