సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సీబీఐకి ( CBI ) అప్పగించాల్సిందిగా బీహార్ సర్కార్ చేసిన విజ్ఞప్తిని అంగీకరిస్తున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. ఇదే విషయాన్ని బుధవారం సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తరపున సుప్రీం కోర్టుకు తెలియజేశారు. సుశాంత్ సింగ్ మృతి కేసులో ( Sushant Singh Rajput's death case ) సీబీఐ చేత దర్యాప్తు చేయించాల్సిందిగా మంగళవారం బీహార్ సీఎం నితీష్ కుమార్ కోరిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. Also read: Asaduddin Owaisi: రామ మందిరం భూమి పూజ.. అసదుద్దీన్ సంచలన ట్వీట్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుంటే, మరోవైపు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని ( Actress Rhea Chakraborty ) కారకురాలిగా ఆరోపిస్తూ పాట్నాలో సుశాంత్ తండ్రి కెకె సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పాట్నా పోలీసులు.. ఆ కేసు విచారణను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ కేసు విచారణను ముంబైకి బదిలీ చేయాల్సిందిగా కోరుతూ నటి రియా చక్రవర్తి సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి కూడా విదితమే. Also read: Sushant death case: సుశాంత్ మృతి కేసులో కీలక పరిణామం


రియా చక్రవర్తి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. రియా చక్రవర్తి తరపున సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్ శ్యామ్ దివాన్ వాదనలు వినిపిస్తుండగా.. బీహార్ సర్కార్ ( Bihar govt ) తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహ్తగీ వాదనలు వినిపిస్తున్నారు. రియా దాఖలు చేసిన ఈ పిటిషన్ విచారణ కొనసాగుతుండగానే తాజాగా ఈ పరిణామం చోటుచేసుకుంది. Aarthi Agarwal biopic: ఆర్తి అగర్వాల్‌పై బయోపిక్