Unstoppable With NBK 2: బాలక్రిష్ణని ఇరకాటంలో పెట్టిన బాబు.. 95 ఎపిసోడ్లో తప్పెవరిదో చెప్పించాడుగా!
Chandrababu and Balakrishna Clarity on Vennupotu Episode: అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2లో వెన్నుపోటు ఎపిసోడ్ గురించి చంద్రబాబు పెదవి విప్పారు.
Chandrababu and Balakrishna Clarity on Vennupotu Episode: నందమూరి బాలకృష్ణ హోస్టుగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2 ప్రారంభమైంది. అక్టోబర్ 14వ తేదీన ఈ సీజన్ కి సంబంధించిన మొదటి ఎపిసోడ్ స్ట్రీమ్ అవుతోంది. మొదటి ఎపిసోడ్లో నందమూరి బాలకృష్ణ బావ, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా 1995లో ఎన్టీఆర్ ని గద్దె దించి తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు దారి తీసిన కారణాలను చంద్రబాబు బయటపెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 1995 వ సంవత్సరంలో జరిగిన సంఘటన తన జీవితంలో మరిచిపోలేనని అన్నారు.
తాను దైవ సమానంగా భావించే నందమూరి తారక రామారావు జీవితంలోకి ప్రవేశించిన ఒక వ్యక్తి వల్ల పరిస్థితులన్నీ తారుమారయ్యాయని ఆయన అన్నారు. బాలకృష్ణ, హరికృష్ణ తాను కలిసి నందమూరి తారక రామారావు దగ్గరకు వెళ్ళామని ముగ్గురం కలిసి లోపలికి వెళ్లి అడిగామని అన్నారు. అలా అడిగితే ఇది రాజకీయం గురించా? లేక పర్సనల్ లైఫ్ గురించా? అని అడిగారని పర్సనల్ లైఫ్ కాదు రాజకీయం గురించి అని చెబితే వీరిద్దరికీ దానితో సంబంధం లేదని చెబుతూ హరికృష్ణ, బాలకృష్ణ ఇద్దరినీ బయటకు పంపారని గుర్తు చేసుకున్నారు.
ఆ తర్వాత మూడు గంటలపాటు అన్ని విధాలుగా ఆయనను బతిమిలాడాలని తర్వాత ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాన్ని కూడా తాను అన్ని వివరాలు అన్ని విధాలుగా వివరించి చెప్పానని అయినా సరే ఆయన మాత్రం తాను నమ్మిన దారిలోనే ముందుకు వెళతానని స్పష్టం చేశారని, ఇక తాను బయటకు వచ్చి మీకు విషయం చెప్పానని అంటూ అప్పటి విషయాన్ని బాలకృష్ణకు చంద్రబాబు గుర్తు చేశారు. అంతేకాక ఈ విషయంలో నా తప్పు ఏమైనా ఉందా? అని చంద్రబాబు ప్రశ్నించగా నందమూరి బాలకృష్ణ ఒక ఉదాహరణ చెప్పారు.
గతంలో ఆయన అనేక సినిమాల్లో నటుడిగా దర్శకుడిగా పని చేశారని కానీ ఆయనలో ఉన్న దర్శకుడిని ఆయనలో ఉన్న నటుడు డామినేట్ చేస్తూ ఉండేవారని అన్నారు. అలాంటి సందర్భాల్లో తాను కొన్నిసార్లు ఇలా చేయడం కరెక్ట్ కాదని తన తండ్రికి చెప్పానని ఇక ఈ 95 ఎపిసోడ్ విషయంలో కూడా అదే జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. పొలిటికల్ లైఫ్, పర్సనల్ లైఫ్ డామినేట్ చేసిందని అందువల్ల ఆయన ఆ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు అని అన్నారు.
ఇందులో ఆయన జీవితంలోకి వచ్చిన వ్యక్తులు చేసిన ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆయన పదవి కోల్పోవాల్సి వచ్చిందనే విషయాన్ని నందమూరి బాలకృష్ణ ఒప్పుకున్నారు. అయితే ఇది ఆరోజు అందరం కలిసి తీసుకున్న నిర్ణయం ఇది, ఈ నిర్ణయంలో ఒకరి తప్పు ఎత్తి చూపించాల్సిన అవసరమే లేదని కుండ బద్దలు కొట్టారు. దీంతో ఇప్పటివరకు చంద్రబాబు వెన్నుపోటు ఎపిసోడ్ అంటూ జరుగుతున్న ప్రచారం మీద ఆయన ప్రతి ఆయన ప్రత్యర్థులు ఎలా కామెంట్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: Allu Arjun - Godfather : గాడ్ ఫాదర్ లడ్డూలా ఉందట.. బన్నీ రియాక్షన్ మీద నెటిజన్ల సెటైర్లు
Also Read: Priyanth Rao Wife Hulchul: రేప్ కేసులో హీరో అరెస్ట్.. భర్తను దోమలు కుడతాయంటూ భార్య రచ్చ!