Allu Arjun - Godfather : గాడ్ ఫాదర్ లడ్డూలా ఉందట.. బన్నీ రియాక్షన్ మీద నెటిజన్ల సెటైర్లు

Allu Arjun Watches Chiranjeevi Godfather చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాను అల్లు అర్జున్ వీక్షించాడట. అయితే బన్నీ రియాక్షన్ గురించి తాజాగా డైరెక్టర్ మోహన్ రాజా మీడియా ముందు చెప్పేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 14, 2022, 12:05 PM IST
  • బాక్సాఫీస్ వద్ద గాడ్ ఫాదర్ జోరు
  • గాడ్ ఫాదర్‌ను వీక్షించిన అల్లు అర్జున్
  • లడ్డూల ఉందన్న బన్నీ
Allu Arjun - Godfather : గాడ్ ఫాదర్ లడ్డూలా ఉందట.. బన్నీ రియాక్షన్ మీద నెటిజన్ల సెటైర్లు

Allu Arjun - Godfather : మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా గత వారం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్ల విషయంలో మాత్రం గందరగోళం నెలకొంది. వాళ్లు చెప్పే కలెక్షన్లు, ట్రేడ్ వర్గాల్లో వస్తోన్న కలెక్షన్లకు ఎంతో తేడా ఉందని తెలుస్తోంది. సినిమా బ్రేక్ ఈవెన్ ఇంకా కాకపోవడంతే వీక్ డేస్‌లో కలెక్షన్లు మరింతగా వీక్‌గా ఉండటంతో గాడ్ ఫాదర్ గట్టెక్కడం కష్టంగామారింది. వంద కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్టుగా పోస్టర్లు వేసుకుంటున్నారు గానీ రియాల్టీ మాత్రం వేరేలా ఉందని నెటిజన్లు అంటున్నారు.

ఇక ఈ కలెక్షన్ల మీద నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడాడు. ఈ సినిమాను ఎవ్వరికీ అమ్మలేదని, తామే సొంతంగా రిలీజ్ చేశామని, ఈ కలెక్షన్లు బాగానే ఉన్నాయని, తమకు ఇది ప్రాఫిట్ అవుతోందంటూ ఇలా చెప్పుకుంటూ వెళ్లాడు. రెండో వారాంతంలో కూడా గాడ్ ఫాదర్ బాగానే ఆడేట్టు కనిపిస్తోంది. పెద్ద సినిమాలేవీ బరిలో లేకపోవడంతో గాడ్ ఫాదర్ మళ్లీ పుంజుకునే చాన్స్ ఉంది.

అందుకే చిరంజీవి, మోహన్ రాజా ఇలా అందరూ కూడా మీడియా ముందుకు వస్తున్నారు. ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మోహన్ రాజా మాట్లాడుతూ.. గాడ్  ఫాదర్ చిత్రాన్ని బన్నీ వీక్షించాడని చెప్పుకొచ్చాడు. 21 నిమిషాల పాటు ఫోన్‌లొ మాట్లాడట. పిచ్చెక్కించారు సర్ అని అనేశాడట. సినిమా లడ్డూలా ఉందని పొగిడేశాడట.

 

అయితే దీనిపై నెటిజన్లు మాత్రం రకరకాలుగా సెటైర్లు వేస్తున్నారు. అసలే అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మధ్య కాస్త దూరం ఉందన్న సంగతి తెలిసిందే. బన్నీ కూడా మెగా క్యాంపుకు దూరంగా ఉండేందుకు, తన సొంత బ్రాండ్‌ను క్రియేట్ చేసుకునేందుకు తాపత్రయపడుతున్నట్టుగా అనిపిస్తోంది.

 

దీంతో గాడ్ ఫాదర్ సినిమా మీద బన్నీ రియాక్ట్ అయ్యాడని చెప్పడం, లడ్డూలా ఉందని అనడంపై నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. ఏంటి ఏదో తేడాగా ఉందే.. అంటూ నెటిజన్లు మీమ్స్, ట్రోల్స్ చేస్తున్నారు. అయితే తమ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి బేదాభిప్రాయాలు లేవని చిన్న పాటిగా పోటీ మాత్రమే ఉందని అల్లు అరవింద్ అన్నాడు.

Also Read : Acharya : 80 శాతం రెమ్యూనరేషన్ వాపస్.. ఆచార్య పేరు ఎత్తేందుకు ఇష్టపడని చిరు!

Also Read :Karwa chauth 2022 : కర్వాచౌత్ స్పెషల్.. కొత్త జంటల సందడి.. కత్రినా-విక్కీ జోడి పిక్స్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

Trending News