Cholesterol Control Tips: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరినప్పుడు ఈ సమస్యలు వస్తే.. ఇలా చేయండి..!
High Cholesterol Symptoms: శరీరంలో అనారోగ్య సమస్యలుంటే.. తప్పకుండా వాటి ప్రభావం బాహ్య చర్మంపై పడుతుంది. అంతేకాకుండా అవయవాలపై కూడా కొంత ప్రభావం చూపుతుంది. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు పలు రకాల బాహ్య శరీరంపై పలు రకాల మార్పులు, సమస్యలు ఉత్పన్నమవుతాయని నిపుణులు తెలుపుతున్నారు.
High Cholesterol Symptoms: శరీరంలో అనారోగ్య సమస్యలుంటే.. తప్పకుండా వాటి ప్రభావం బాహ్య చర్మంపై పడుతుంది. అంతేకాకుండా అవయవాలపై కూడా కొంత ప్రభావం చూపుతుంది. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు పలు రకాల బాహ్య శరీరంపై పలు రకాల మార్పులు, సమస్యలు ఉత్పన్నమవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే వివిధ లక్షణాలు, సంకేతాలు కనిపిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇవీ అనారోగ్య సమస్యలకు హెచ్చరికలని.. ఈ సంకేతాలు వచ్చినప్పుడు వైద్యలను సంప్రదించడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. ఇలా సరైన సమయంలో డాక్టర్లను సంప్రదించడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
అధిక కొలెస్ట్రాల్ సంకేతాలు, లక్షణాలు:
పాదాలపై ప్రభావం:
బాడీలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు పాదాలలో తిమ్మిర్ల సమస్యలు వస్తాయి. అంతేకాకుండా కదలిక సమస్యలు కూడా నిలిచిపోతాయి. ముఖ్యంగా పాదాలపై రంగు మారడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
పాదాలలో నొప్పి:
కొలెస్ట్రాల్ కారణంగా కాళ్ల సిరల్లో కూడా రక్తప్రసరణ సరిగా జరగదు. అంతేకాకుండా కొంద మందిలో ఆక్సిజన్ కూడా సరిగా అందదు. అటువంటి పరిస్థితిలో పాదాలలో నొప్పి కూడా కలుగుతుంది.
గోర్లు పసుపు రంగులోకి మారడం:
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ప్రభావం గోళ్లపై పడుతుంది. శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్ సిరలను నిరోధించడం మొదలవుతుంది. దీని కారణంగా బాడీలో వివిధ ప్రదేశాలకు రక్తప్రసరణ అగిపోతుంది. దీంతో గోళ్లు కూడా పసుపు రంగులోకి మారుతుంది.
ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి:
>>శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
>>ధూమపానం అలవాటు ఉన్నవారు తప్పకుండా మానేయండి.
>>తక్కువ కొవ్వు ఉన్న ఆహారం తీసుకోండి.
>> జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్‌కు దూరంగా ఉండండి.
>>రోజూ వ్యాయామం చేయండి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read:Shyja Moustache: మీసమున్న మహిళ.. 'చురకత్తి' లాంటి ఆ మీసాలు లేకుండా జీవితాన్నే ఊహించుకోలేదట..
Also read:Mohanbabu: చంద్రబాబుతో మోహన్ బాబు భేటీ అందుకే.. అసలు విషయం చెప్పేశారు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook