దంపతుల ఆత్మహత్య..
బీహార్ రాష్ట్రానికి చెందిన దంపతులు ఉపాధి కోసం పది నెలల క్రితం ఘజియాబాద్ కు వచ్చారు. వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఘజియాబాద్ లోని ఇందిరాపురంలో శుక్రవారం చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ: బీహార్ రాష్ట్రానికి చెందిన దంపతులు ఉపాధి కోసం పది నెలల క్రితం ఘజియాబాద్ కు వచ్చారు. వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఘజియాబాద్ లోని ఇందిరాపురంలో శుక్రవారం చోటు చేసుకుంది. భర్త నోయిడాలోని ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య ఇంట్లోనే ఉంటుంది. లాక్ డౌన్ నేపథ్యంలో భర్త ఇంటి నుండే వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున తాము అద్దెకు ఉండే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఆత్మహత్య చేసుకున్నారు. వీరు ఆత్మహత్య చేసుకునే ముందు గ్రేటర్ నోయిడాలో ఉండే బంధువులకు తమ కూతురును తీసుకెళ్లాలని మెసేజ్ పెట్టారు.
Also Read: Galwan Valley clash: ప్రధాని మోదీపై ధ్వజమెత్తిన రాహుల్..
దీంతో వారి బంధువులు ఇందిరాపురం వచ్చి చూడగా ఇంటి లోపల నుండి తలుపు మూసి ఉండడంతో అనుమానం వచ్చి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా దంపతులు వేర్వరు గదుల్లో విగతజీవులుగా కనిపించారు. ఆమె కూతురును మృతురాలి సోదరి తీసుకెళ్లింది. ఘటనాస్థలిలో ఎటువంటి సూసైడ్ లేఖ దొరకలేదని, ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దంపతుల ఆత్మహత్యకు దారితీసిన కారణాలు తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు.
Also Read: DGCA: అంతర్జాతీయ విమానాలు జూలై 15 వరకు రద్దు