DGCA: అంతర్జాతీయ విమానాలు జూలై 15 వరకు రద్దు

International Flights: భారత్‌లో కరోనావైరస్ సంక్రమణ పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ నివారణ దిశగా సివిల్ ఏవియేషన్ రెగ్యులేటర్ డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( DGCA ) కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమానాల రద్దు గడువును జూలై 15 వరకు పొడిగిస్తున్నట్టు డీజీసీఏ స్పష్టంచేసింది.

Last Updated : Jun 26, 2020, 07:25 PM IST
DGCA: అంతర్జాతీయ విమానాలు జూలై 15 వరకు రద్దు

International Flights: భారత్‌లో కరోనావైరస్ సంక్రమణ పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ నివారణ దిశగా సివిల్ ఏవియేషన్ రెగ్యులేటర్ డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( DGCA ) కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమానాల రద్దు గడువును జూలై 15 వరకు పొడిగిస్తున్నట్టు డీజీసీఏ స్పష్టంచేసింది. అయితే కొన్ని ఎంపిక చేసుకున్న మార్గాల్లో మాత్రం సేవలు కొనసాగించే అవకాశం ఉంది అని విమానాయాన శాఖ ( Aviation Ministry ) తెలిపింది. అయితే కార్గో విమానాలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని డీజీసీఏ స్పష్టం చేసింది.

 

గమ్యస్థానం చేరిన 20 లక్షల మంది
కోవిడ్ -19 సంక్రమణను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మార్చి చివరి వారంలో అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది.  అయితే సుమారు రెండు నెలల విరామం తరువాత మే 25 నుంచి కొన్ని దేశీయ విమానాలకు ( Domestic Flights ) అనుమతినిచ్చింది. నాటి నుంచి నేటి వరకు సుమారు 20 లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకున్నట్టు విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.

అయితే విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు వందే భారత్ మిషన్ (  Vande Bharat Mission ) ను ప్రారంభించింది. ఈ మిషన్‌లో భాగంగా అందుతున్న విమానాల సేవల ద్వారా సుమారు లక్షా 25 వేల మంది భారతీయులు స్వదేశానికి తిరిగివచ్చారు.

Trending News