న్యూఢిల్లీ: లడఖ్‌లోని గాల్వన్‌లోయలో భారత సైన్యంలోని 20 మంది సైనికులు అమరులు కావడంతో దేశమంతా అట్టుడికిపోతోంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ శుక్రవారం ట్విట్టర్‌లో ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ప్రధాని భయపడకుండా నిజం చెప్పాలని కోరారు.
प्रधानमंत्री जी,
देश आपसे सच सुनना चाहता है।#SpeakUpForOurJawans pic.twitter.com/tY9dvsqp4N
— Rahul Gandhi (@RahulGandhi) June 26, 2020
Also Read: Haryana Earthquake: ఉత్తర భారతాన్ని వణికిస్తోన్న వరుస భూకంపాలు
రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశం మొత్తం సైన్యం, ప్రభుత్వంతో ఐక్యంగా నిలుస్తుందన్నారు. కాగా కొద్ది రోజుల క్రితం మన ప్రధాని స్పందిస్తు ఎవరూ భారతదేశానికి రాలేదని, మన భూమిని ఎవరూ ఆక్రమించలేదని అన్నారు. కానీ ఈ చిత్రంలో ఉపగ్రహం కనిపించినట్లు మాజీ ఆర్మీ జనరల్ చెబుతున్నారన్నారు. చైనా మన భూమిని ఒకటి కాకుండా మూడు ప్రదేశాలను స్వాధీనం చేసుకున్నట్లు లడఖ్ ప్రజలు చెబుతున్నారని, దీనికి ప్రధానిగా మీరు నిజం చెప్పాలన్నారు. భయపడాల్సిన అవసరం లేదని అమరువీరులైన మన సైనికులకు ఆయుధాలు లేకుండా సరిహద్దుకు ఎందుకు పంపారో తెలియజేయాలని ప్రశ్నించారు.
Also Read: Guwahati Lockdown: 2 వారాల లాక్‌డౌన్... రాత్రి పూట కర్య్ఫూ